రామ్ లిరిక్స్.. ఎంతో క్యూట్ గా పాడిన భాగ్యశ్రీ!
ఇప్పుడు ఆ పాటను భాగ్యశ్రీ బొర్సే పాడారు. బ్యాక్ గ్రౌండ్ లో ఆ బ్లాక్ బస్టర్ మెలోడీ సాంగ్ ప్లే అవుతుంటే.. లిరిక్స్ ను ఎంతో అందంగా ఆలపించింది.
By: M Prashanth | 22 Sept 2025 3:02 PM ISTయంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే గురించి ఎంత చెప్పినా తక్కువే. యూత్ కలల రాణిగా మారిన అమ్మడు.. మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. సినిమాలో యాక్టింగ్, గ్లామర్ కు అంతా ఫిదా అయ్యారు. తెలుగులో డెబ్యూ మూవీతోనే యువతలో స్పెషల్ క్రేజ్ ఆమె సొంతమైందనే చెప్పాలి.
సినిమా అనుకున్నట్లు రాణించకపోయినా.. భాగ్యశ్రీకి ఫేమ్ మాత్రం మామూలుగా రాలేదు. వరుస ఆఫర్స్ ఆమె సొంతమయ్యాయి. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో వచ్చిన కింగ్ డమ్ లో నటించింది అమ్మడు. కానీ సినిమాలో చేసిన రోల్ కు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో భాగ్యశ్రీ బొర్సేకు కలిసి రాలేదు.
ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ పి.మహేష్ బాబు దర్శకత్వంలో భాగ్యశ్రీ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాలేజీ అమ్మాయిగా కనిపించనుండగా.. ఇప్పటికే ఆమెకు సంబంధించిన లుక్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
అయితే ఆ సినిమాకు గాను.. రామ్ తనలోని రైటర్ ను పరిచయం చేశారు. 'నువ్వుంటే చాలే' పాటకు లిరిక్స్ అందించగా.. వివేక్, మెర్విన్ ట్యూన్ కంపోజ్ చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆ సాంగ్.. పాడగా ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ట్రెండింగ్ లో కూడా నిలిచింది.
ఇప్పుడు ఆ పాటను భాగ్యశ్రీ బొర్సే పాడారు. బ్యాక్ గ్రౌండ్ లో ఆ బ్లాక్ బస్టర్ మెలోడీ సాంగ్ ప్లే అవుతుంటే.. లిరిక్స్ ను ఎంతో అందంగా ఆలపించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో క్యూట్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ముద్దుముద్దుగా పాడిందని చెబుతున్నారు.
అదే సమయంలో రామ్ లిరిక్స్ రాసిన సాంగ్ ను భాగ్యశ్రీ ఆలపించడం గమనార్హం. మొత్తానికి ఈ మ్యాటర్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే రామ్, భాగ్యశ్రీ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దానిపై ఇప్పటి వరకు ఇద్దరూ ఎక్కడా స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. ఓసారి భాగ్యశ్రీ పరోక్షంగా రెస్పాండ్ అయ్యారు.
