Begin typing your search above and press return to search.

కమలం వోలే దేవకన్యను తలపిస్తున్న భాగ్యశ్రీ!

తెరపై అందంగా, హుందాగా కనిపించే ఎంతోమంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసే ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి.

By:  Madhu Reddy   |   14 July 2026 1:03 PM IST
కమలం వోలే దేవకన్యను తలపిస్తున్న భాగ్యశ్రీ!
X

తెరపై అందంగా, హుందాగా కనిపించే ఎంతోమంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసే ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. దివి నుంచి భువికి దిగి వచ్చారా అనే అనుమానాలు కలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి రూప లావణ్యం వెనుక ఎంతో మంది శ్రమ ఉన్నప్పటికీ.. తెరపై కనిపించే ఈ ముద్దుగుమ్మలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటారు.అలా అందాల సోయగాలతో దేవకన్యలను తలపిస్తూ భూలోక వాసులను ఆకట్టుకుంటున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో భాగ్యశ్రీ బోర్సే కూడా ఒకరు.





అందం , అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన అద్భుతమైన నటనను కనబరిచి అందరిచేత ప్రశంసలు అందుకుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమాలో భారతి పాత్ర పోషించి క్లైమాక్స్ లో అందరి చేత కంటతడి పెట్టించింది. తన అద్భుతమైన నటన పెర్ఫార్మన్స్ తో అభిమానులను దక్కించుకుంది భాగ్యశ్రీ. ఒకవైపు ఆకట్టుకుంటూనే మరొకవైపు ఎమోషన్ పండిస్తూ అభిమానుల హృదయాలను దోచుకుంది. అలాంటి ఈమె తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.





పర్పుల్ కలర్ చీర కట్టుకొని దీనికి కాంబినేషన్లో షోల్డర్ లెస్ బ్లౌజ్ ధరించింది. సింపుల్ జువెలరీ తో.. చేతిలో తామర పువ్వు పట్టుకొని కమలం లాగా వికసిస్తూ అందరి హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా ఈ పర్పుల్ కలర్ ఆమె మేని ఛాయను మరింత రెట్టింపు చేసింది. రష్మితతాత డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ మేకోవర్ చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కమలం వోలే దివి నుంచి భువికి దిగివచ్చిందా ఈ సుందరి అనే రేంజ్ లో ఫాలోవర్స్ కవిత్వాలు విసురుతున్నారు. ఇక మరి కొంతమంది దైవత్వం ఉట్టిపడేలా చాలా అందంగా ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే భాగ్యశ్రీ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఔట్ఫిట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలలో వయ్యారి కమలం పువ్వును తన మోము వద్ద ఉంచి.. ఆ కమలానికే అసూయ పుట్టేలా తన అందంతో మెస్మరైజ్ చేసింది. భాగ్యశ్రీ షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.





యారియాన్ 2 చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైన ఈమె.. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక చివరిగా రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఈ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయినా తాజాగా వచ్చిన అఖిల్ లెనిన్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సక్సెస్ ఇచ్చిన ఆనందంతో జోరు మీదున్న ఈమె మరిన్ని అవకాశాలు అందుకోవాలని ఆశిద్దాం..