Begin typing your search above and press return to search.

ప్లాప్ బ్యూటీని పిలిచి మ‌రీ లాంచ్ చేస్తున్నారే?

టాలీవుడ్ లో మోస్ట్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రంటే? ముంబై బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే పేరు చెబుతారంతా. అమ్మ‌డు ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు సినిమాల్లో న‌టించింది.

By:  Srikanth Kontham   |   18 March 2026 10:00 PM IST
ప్లాప్ బ్యూటీని పిలిచి మ‌రీ లాంచ్ చేస్తున్నారే?
X

టాలీవుడ్ లో మోస్ట్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రంటే? ముంబై బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే పేరు చెబుతారంతా. అమ్మ‌డు ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు సినిమాల్లో న‌టించింది. నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా అవ‌కాశాలు మాత్రం త‌గ్గ‌లేదు. ప్లాప్ ల‌తో సంబంధం లేకుండా కొత్త అవ‌కాశాలు అందుకోవ‌డంలో జోరు చూపిస్తోంది. ఇటీవలే ఆంధ్రా కింగ్ తాలూకా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. రివ్యూలు పాజిటివ్‌గా వచ్చాయి. నటిగా భాగ్యశ్రీకి మంచి మార్కులే పడ్డాయి. హిట్ టాక్ వినిపించినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం సినిమా నిరాశపరిచింది.

ఇలా వరుసగా పరాజయాలు పలకరిస్తున్నా? భాగ్యశ్రీకి ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఆమెలోని గ్లామర్ , స్క్రీన్ ప్రెజెన్స్ మేకర్స్‌ను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. తెలుగులో విజయాలు లేకపోయినా పక్కనే ఉన్న కోలీవుడ్ మాత్రం ఈ భామను రెడ్ కార్పెట్ వేసి మ‌రీ ఆహ్వానించ‌డం విశేషం. భాగ్యశ్రీలోని స్పార్క్ గుర్తించిన తమిళ మేకర్స్ ఆమెకు క్రేజీ ప్రాజెక్టులలో ఆఫర్లు ఇస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సియోన్ లో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

తాయ్ కిళ‌వి ఫేం శివ‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. సాధారణంగా ఒక భాషలో వరుస ప్లాపులు వస్తే ఇతర పరిశ్రమలు ఆ హీరోయిన్‌ను పట్టించుకోవు. కానీ భాగ్యశ్రీ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ఆంధ్రా కింగ్ తాలూకా వంటి సినిమాల్లో ఆమె నటన చూసి శివకార్తికేయన్ ఆమెను సినిమాలో భాగం చేసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్లాప్ బ్యూటీ అని ముద్ర పడినా? పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారంటే భాగ్యశ్రీలో ఏదో ప్రత్యేకత ఉందనేది స్పష్టమవుతోంది.

ప్రస్తుతం శివకార్తికేయన్ వరుస విజయాలతో కోలీవుడ్‌లో టాప్ గేర్‌లో ఉన్నాడు. ఆయనతో జోడీ కట్టడం అంటే భాగ్యశ్రీ బోర్సేకు కోలీవుడ్ లో గ్రాండ్ లాంచ్ దొరికినట్లే. శివ‌కుమార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ క‌న్ప‌మ్ అయితే? కేవలం గ్లామర్ బొమ్మగానే కాకుండా మంచి నటిగా కూడా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే? భాగ్యశ్రీ రేంజ్ ఒక్కసారిగా మారిపోవడం ఖాయం.సక్సెస్ అనేది కేవలం బాక్సాఫీస్ అంకెల్లోనే ఉండదు. నటుల ప్రతిభలో కూడా ఉంటుందని భాగ్యశ్రీ నిరూపిస్తోంది. తెలుగులో అదృష్టం కలిసి రాకపోయినా? తమిళ గడ్డపై అమ్మ‌డు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. సియోన్ చిత్రంతోనైనా ముంబై సుందరి ప్లాప్ బ్యూటీ అనే ముద్రను చెరిపేసుకుంటుందేమో చూడాలి.