Begin typing your search above and press return to search.

వీడియో : కన్ఫర్మ్‌గా ఆమెది లవ్‌ మ్యారేజ్‌..!

ప్రస్తుతం ఆంధ్రా కింగ్‌ తాలూక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్న ఈ అమ్మడు మరిన్ని తెలుగు సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

By:  Ramesh Boddu   |   18 Nov 2025 11:42 AM IST
వీడియో : కన్ఫర్మ్‌గా ఆమెది లవ్‌ మ్యారేజ్‌..!
X

గత ఏడాది రవితేజ హీరోగా వచ్చిన 'మిస్టర్‌ బచ్చన్‌' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ భాగ్య శ్రీ బోర్సే ప్రస్తుతం టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రా కింగ్‌ తాలూక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్న ఈ అమ్మడు మరిన్ని తెలుగు సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈమె కాంత సినిమాతో వచ్చింది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ఆ సినిమాలో భాగ్యశ్రీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. పాత కాలం తరహా హీరోయిన్‌ పాత్రను పోషించి మెప్పించింది. ఆ సినిమా విభిన్నమైన అనుభవంను తనకు ఇచ్చింది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే పెళ్లి వార్తలు...

ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మీరు లవ్‌ మ్యారేజ్ చేసుకుంటారా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా అని ప్రశ్నించిన సమయంలో ఆమె క్షణం ఆలోచించకుండా లవ్‌ మ్యారేజ్ చేసుకుంటాను అంటూ తేల్చి చెప్పింది. అప్పుడు యాంకర్‌ మీరు ఇప్పుడు ప్రేమలో ఉన్నారా అంటూ ప్రశ్నించింది. అందుకు వెంటనే లేదు, ప్రస్తుతానికి ప్రేమలో లేను అని చెప్పింది. ప్రేమలో లేకుండానే మీరు ప్రేమ వివాహం చేసుకుంటాను అని ఎలా చెబుతున్నారు అంటూ యాంకర్‌ ప్రశ్నించగా, తనకు ప్రేమ మీద విశ్వాసం ఎక్కువ అని, అందుకే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. లవ్‌ మ్యారేజ్ ఎప్పడు, ఏంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ కన్ఫర్మ్‌గా తాను లవ్‌ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం భాగ్యశ్రీ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ప్రేమలో మిస్టర్ బచ్చన్‌ హీరోయిన్‌...

సాధారణంగా హీరోయిన్స్‌ ప్రేమ వివాహం గురించి మరీ ఇంత ఓపెన్‌గా మాట్లాడటం మనం అరుదుగా చూస్తూ ఉంటాం. ఒక హీరోయిన్‌ ప్రేమలో ఉన్నప్పటికీ తాను ప్రేమ వివాహం చేసుకుంటాను అని చెప్పేందుకు భయపడుతుంది. కాస్త ఆలోచించి ఇప్పుడే చెప్పలేను అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తుంది. కానీ భాగ్యశ్రీ బోర్సే మాత్రం తాను లవ్‌ మ్యారేజ్ చేసుకుంటాను అంటూ తేల్చి చెప్పడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఇప్పటికే లవ్‌ లో ఉందేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆమె తన లవ్‌ ఇష్యూ గురించి బయటకు చెప్పాలి అనుకోవడం లేదు. కెరీర్‌ లో బిజీగా ఉన్న కారణంగా ప్రేమ విషయాన్ని దాస్తున్న భాగ్యశ్రీ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీగా ఉంది. ఒక అమ్మాయి అప్పటికే ప్రేమలో ఉంటే తప్ప తాను ప్రేమ వివాహం చేసుకుంటాను అని చెప్పదు అని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి అసలు విషయం ఏంటి అనేది కాలమే సమాధానం ఇవ్వాల్సి ఉంది.

ఆంధ్రా కింగ్‌ తాలూక సినిమాతో రీ ఎంట్రీ

ఇక భాగ్యశ్రీ సినిమాల విషయానికి వస్తే 2023లో యారియన్‌ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో హిందీలో పెద్దగా ఆఫర్లు రాలేదు. పైగా యారియన్‌ 2 సినిమాలో ఈమెకు దక్కింది గెస్ట్‌ రోల్‌ మాత్రమే. అందుకే మరిన్ని సినిమా ఆఫర్ల కోసం ఈ అమ్మడు గట్టిగానే ప్రయత్నాలు చేసింది. ఫైనల్‌గా ఈ అమ్మడికి మిస్టర్‌ బచ్చన్‌ సినిమాలో లీడ్‌ రోల్ చేసే అవకాశం దక్కింది. బాలీవుడ్‌ లో గెస్ట్‌ రోల్స్ కి పరిమితం చేస్తూ ఉండగా, సౌత్‌ లో మాత్రం ఈమెకు స్టార్‌డం దక్కే హీరోయిన్‌ పాత్రలు వస్తున్నాయి. అందుకే హిందీ వైపు చూడకుండా ఎక్కువగా సౌత్‌ సినిమాలు చేయాలని, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు చేయాలని భాగ్యశ్రీ బోర్సే ప్రయత్నాలు చేస్తుంది అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. భాగ్యశ్రీ ముందు ముందు టాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.