భాగ్య శ్రీ బోర్సే ఇంకెంత కాలం!
ముంబై బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్ కెరీర్ ఎలా సాగుతుందన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 18 Feb 2026 7:00 AM ISTముంబై బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్ కెరీర్ ఎలా సాగుతుందన్నది చెప్పాల్సిన పనిలేదు. `మిస్టర్ బచ్చన్` తో లాంచ్ అయిన అమ్మడి కెరీర్ లో ఇంత వరకూ కమర్శియల్ గా ఒక్క హిట్ కూడా పడలేదు. ట్యాలెంట్ సహా అందం, అభినయంతోనే అవకాశాలు అందుకుంటుంది తప్ప! సక్సెస్ లు చూసి మాత్రం ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదన్నది కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. `మిస్టర్ బచ్చన్`, `కింగ్ డమ్`, `కాంత` ఇలా వరుసగా మూడు ప్లాపులతో హ్యాట్రిక్ నమోదు చేసింది. `కాంత` కోలీవుడ్ డెబ్యూ అయినా అక్కడా నిరాశ తప్పలేదు.
చివరి చిత్రం `ఆంధ్రాకింగ్ తాలూకా` సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా? వసూళ్లు రాలేదు. దీంతో ఆ సినిమా ఫలితం కూడా శూన్యంగానే మారిపోయింది. హిట్లు లేకపోయినా ఇన్ని అవకాశాలు అందుకోవడం అన్నది గొప్ప విషయం. అప్పట్లోరాశీకఖన్నాకు ఇలా చెల్లింది. ఆ తర్వాత మళ్లీ భాగ్య శ్రీకే విజయాలు లేకుండా అవకాశాలు అందుకుంటుంది. అయితే ఇలా ఇంకెంతో కాలం చెల్లదు. అమ్మడిపై నెగిటివిటీ ఎక్కువవుతోంది. ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. ఒక్కసారిగా ఆ ట్యాగ్ పడిందంటే? అవకాశాలు అంత సులభం కాదు.
ఎంత ట్యాలెంట్ ఉన్నా? ఎంతటి బ్యూటీ అయినా? నెగిటివిటీ లేనంత కాలమే మార్కెట్ లో చెల్లుతుంది. ప్రస్తుతం భాగ్య శ్రీ బోర్సే చేతిలో ఉన్నది ఒకే ఒక్క చిత్రం. అదే అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తోన్న `లెనిన్`. ఇందులో అమ్మడు అఖిల్ కి జోడీగా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అఖిల్ కి కూడా ఇంత వరకూ సరైన హిట్ లేదు. `లెనిన్` తో మంచి హిట్ అందుకుంటాడనే అంచనాలు బలంగా ఉన్నాయి. `లెనిన్` హిట్ అయితే ఇద్దరి కెరీర్ కలిసొస్తుంది. భాగ్య శ్రీకి కొత్త అవకాశాలు అందుకుంటుంది.
మొన్నటి వరకూ ఒక సినిమా సెట్ లో ఉండగానే మరో సినిమాకు సైన్ చేసింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. భాగ్య శ్రీని తీసుకునే ముందు ట్రాక్ రికార్డు చెక్ చేస్తున్నారు. అంతా బాగుంది అనుకుంటేనే దర్శక, నిర్మాతలు, హీరోలు ఒకే చెబుతున్నారు. లేదంటే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు అన్నది తాజా అప్ డేట్. మరి ఈ ఫేజ్ ని భాగ్య శ్రీ ఎలా అధిగమిస్తుంది? అన్నది చూడాలి. ఈ బ్యూటీ కెరీర్ బాలీవుడ్ లో `యారియాన్ 2`తో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అటుపై `చందు ఛాంపియన్` తో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాతో మంచి పేరొచ్చింది. కానీ ఎందుకనో బాలీవుడ్ లో అవకాశాలు అందుకోలేకపోయింది. అదే సమయంలో తెలుగు సినిమా ఛాన్సులు రావడంతో హైదరాబాద్ వచ్చేసింది. అప్పటి నుంచి ఇక్కడే కొనసాగుతోంది.
