Begin typing your search above and press return to search.

సినిమా అంటే ఇంకా భయమేనా? భాగ్య‌శ్రీ కామెంట్స్ తో మొద‌లైన కొత్త డిస్క‌ష‌న్

ఈ నేపథ్యాన్ని గుర్తు చేసేలా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రీసెంట్ గా చేసిన కామెంట్స్ డిస్క‌ష‌న్ కు దారితీశాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   30 July 2026 12:30 PM IST
సినిమా అంటే ఇంకా భయమేనా? భాగ్య‌శ్రీ కామెంట్స్ తో మొద‌లైన కొత్త డిస్క‌ష‌న్
X

సినీ ఇండ‌స్ట్రీలోకి రావాలనుకునే యూత్ సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఆ డెసిష‌న్ ను కుటుంబాలు సులభంగా అంగీకరించక పోవ‌డం ఇప్పటికీ చాలా చోట్ల క‌నిపిస్తోంది. ముఖ్యంగా త‌మ కూతుళ్లు యాక్టింగ్ ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటే సేఫ్టీ, మంచి ఫ్యూచ‌ర్, సామాజిక ఒత్తిడి వంటి అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యాన్ని గుర్తు చేసేలా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రీసెంట్ గా చేసిన కామెంట్స్ డిస్క‌ష‌న్ కు దారితీశాయి.

రీసెంట్ గా ఓ ఇంటరాక్షన్ లో భాగంగా భాగ్య‌శ్రీ తన కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఎదుర్కొన్న ఫ్యామిలీ సిట్యుయేష‌న్స్ ను ప్రస్తావించారు. సినిమాల్లోకి రావాలనే తన డెసిష‌న్ కు ఇంట్లో ఎవరూ వెంటనే మద్దతివ్వలేదని, ముఖ్యంగా త‌న త‌ల్లి తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పారు. ఆ టైమ్ లో తల్లి తనతో మాట్లాడకపోవడమే కాకుండా వాట్సాప్‌లో కూడా బ్లాక్ చేసిందని ఆమె వెల్లడించారు. ఆ సిట్యుయేష‌న్ కొన్ని నెలల తరబడి కొనసాగిందని చెప్పడం, ఒక నటిగా ఎదిగే ప్రయాణంలో ఎదురైన వ్యక్తిగత సంఘర్షణను తెలియ‌చేస్తోంది.

ఇది కేవ‌లం భాగ్యశ్రీ కథ మాత్రమే కాదు. ఇండియ‌న్ ఫ్యామిలీస్ లో సినీ ఇండ‌స్ట్రీ గురించి ఉన్న అభిప్రాయ‌లు ఇంకా పూర్తిగా మారలేదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంట‌ర్టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అది అనిశ్చితితో కూడుకున్న రంగమనే అభిప్రాయం చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది. అందుకే మంచి ఉద్యోగాలు లేదా సాంప్రదాయ వృత్తుల వైపు త‌మ పిల్లలను ప్రోత్సహించే ధోరణి నేటికీ కొనసాగుతోంది.

సక్సెస్‌ఫుల్ సెలబ్రిటీల జీవితాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో కనిపించని పోరాటాలుంటాయ‌ని ఈ విష‌యం మ‌రోసారి నిరూపించింది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించే చిరునవ్వు వెనుక ఒంటరితనం, ఫ్యామిలీతో విభేదాలు, రిజెక్ష‌న్స్, అనిశ్చితి వంటి అనుభవాలు ఎన్నో దాగి ఉంటాయ‌ని అర్థ‌మ‌వుతోంది. భాగ్యశ్రీ చెప్పిన త‌న లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది.

అయితే కొన్నాళ్ల త‌ర్వాత ఫ్యామిలీ కూడా తనను అర్థం చేసుకుని, తాను చేసిన కృషిని గౌరవించిందనే సంకేతాలు ఆమె మాటల్లో కనిపించాయి. ఈ సంఘటన తల్లిదండ్రులు తప్పు చేశారనే విషయం కంటే, వారి భయాలు కూడా ఒక సామాజిక వాస్తవమేనని గుర్తు చేస్తుంది. అదే సమయంలో యూత్ తమ ఆశయాలను సాధించాలంటే టాలెంట్‌తో పాటు సహనం, మానసిక ధైర్యం, ఫ్యామిలీతో సంభాషించే సామర్థ్యం కూడా ఎంత ముఖ్యమో భాగ్యశ్రీ అనుభవం స్పష్టం చేస్తోంది.