Begin typing your search above and press return to search.

రామ్ ఎనర్జీపై భాగ్య శ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ భాగ్య శ్రీ బోర్స్ ఆంధ్రా కింగ్ తాలూకా వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఇంకా సినిమా హీరో రామ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

By:  Ramesh Boddu   |   21 Nov 2025 12:52 PM IST
రామ్ ఎనర్జీపై భాగ్య శ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
X

ఎనర్జిటిక్ స్టార్ రామ్, భాగ్య శ్రీ బోర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేశాడు. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో ఆయన రోల్ కూడా అదిరిపోతుందని టాక్. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ భాగ్య శ్రీ బోర్స్ ఆంధ్రా కింగ్ తాలూకా వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఇంకా సినిమా హీరో రామ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.




కాలేజ్ గోయింగ్ అమ్మాయిగా భాగ్య శ్రీ..

సినిమా గురించి భాగ్య శ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా బాగుంటుందని అన్నారు. ఎమోషన్స్ అందరికీ ఆకట్టుకుంటాయని భాగ్య శ్రీ బోర్స్ చెప్పారు. ఈ సినిమాలో తానొక కాలేజ్ గోయింగ్ అమ్మాయిగా కనిపిస్తాను. రామ్ తో ప్రేమలో పడే కథ ఇది అని అన్నారు. ఇక రామ్ ఎనర్జీ గురించి చెబుతూ ఆయన ఎనర్జిటిక్ యాక్టర్, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టం. సినిమాలో లవ్ సీన్స్, డైలాగ్స్ చాలా బాగుంటాయని అన్నారు.

ఈ సినిమా ఫ్యాన్స్ ఎమోషన్స్ గురించి చెబుతుంది. డైరెక్టర్ మహేష్ ఎంతో అద్భుతంగా ఈ సినిమా రాసుకున్నారని అన్నారు. ఇక నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ సినిమాపై ఉన్న ప్యాషన్ తో పాటు ఆడియన్స్ కి ఒక మంచి సినిమా అనుభవం ఇవ్వాలని చూస్తున్నారని భాగ్య శ్రీ చెప్పారు.

ఆమె నటనకు మంచి మార్కులు పడ్డా కూడా..

టాలీవుడ్ కి మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ బోర్స్ కెరీర్ లో ఇప్పటివరకు ఒక సూపర్ హిట్ కొట్టలేదు. రీసెంట్ గా కాంత సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డా కూడా ఆ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. ఐతే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో మాత్రం భాగ్య శ్రీ పక్కా హిట్ కొట్టేస్తాననే నమ్మకంగా చెబుతుంది. ఆల్రెడీ ఆంధ్రా కింగ్ తాలూకా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రమోషన్స్ లో కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది

వివేక్ మెర్విన్ ఇచ్చిన సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి కాబట్టి రామ్ భాగ్య శ్రీ కలిసి చేసిన ఆంధ్రా కింగ్ ఆడియన్స్ ని నిజంగానే ఆకట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. భాగ్య శ్రీ మాత్రమే కాదు రామ్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. వరుస ఫ్లాపులతో కెరీర్ బ్యాడ్ ఫేజ్ కొనసాగిస్తున్న రామ్ ఆంధ్రా కింగ్ తో ఫ్యాన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు. భాగ్య శ్రీకి కూడా ఈ సినిమా బెస్ట్ హోప్ గా మారింది.