పర్ఫెక్ట్ లుక్.. మెస్మరైజ్ చేస్తున్న భాగ్యశ్రీ!
కుర్రకారు క్రష్ గా మారిపోయిన భాగ్యశ్రీ బోర్సే ఈ మధ్యకాలంలో వరుస ప్రాజెక్టులలో బిజీగా మారుతూనే.. మరోవైపు తన అందాలతో ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో నిలుస్తోంది..
By: Madhu Reddy | 9 Feb 2026 12:00 AM ISTకుర్రకారు క్రష్ గా మారిపోయిన భాగ్యశ్రీ బోర్సే ఈ మధ్యకాలంలో వరుస ప్రాజెక్టులలో బిజీగా మారుతూనే.. మరోవైపు తన అందాలతో ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో నిలుస్తోంది.. 1995 మే 6న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జన్మించిన ఈమె.. మోడల్గా తన కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాతే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 'యారియన్ 2' అనే చిత్రం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె.. 2024లో హిందీ చిత్రమైన 'ఛాంపియన్' అనే సినిమాలో అతిథి పాత్ర పోషించి ప్రేక్షకులను పలకరించింది. 2024 లో హీరోయిన్గా ' మిస్టర్ బచ్చన్' సినిమాతో పూర్తిస్థాయి హీరోయిన్గా అవతరించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇకపోతే మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఉత్తమ మహిళ అరంగేట్రం కోసం సైమా అవార్డును కూడా దక్కించుకుంది. 2025లో గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే అదే ఏడాది రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో హీరోయిన్గా నటించింది. మహేష్ బాబు. పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ టీ- సిరీస్ సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటుంది అనుకున్నారు కానీ పెద్దగా ఈమెకు సక్సెస్ లభించలేదు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరో రామ్ పోతినేని తో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు మాత్రం జోరుగా వినిపించాయి.
అయితే ఈ రూమర్స్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొట్టి పారేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉండగా.. సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న కారణంగా ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు అని చెప్పవచ్చు.
అందులో భాగంగానే తన కోమలమైన మోముతో అభిమానులను మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా క్రీమ్ అండ్ లైట్ మెరూన్ కాంబినేషన్ లో ఒక లాంగ్ ఫ్రాక్ ధరించి తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చెట్ల చాటున చాలా అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. భాగ్యశ్రీ షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి కుర్రకారు మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా పరవశించిపోతున్నారు. అటు అమ్మాయిలు సైతం ఈమె లుక్కు చూసి వావ్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా కొంతమంది ఫైర్ ఏమోజీ లతో పాటు హార్ట్ ఎమోజిలు అలాగే లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ.. నా మనసు దోచేశావు అంటూ మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు. మొత్తానికైతే భాగ్యశ్రీ తన లుక్కుతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
