రామ్ తో రూమర్లు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ
హీరోయిన్ భాగ్యశ్రీ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 24 Nov 2025 4:16 PM ISTహీరోయిన్ భాగ్యశ్రీ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్ సినిమాల తర్వాత రీసెంట్ గా కాంత మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మడు.. ఇప్పటి వరకు సరైన హిట్ ను అందుకోలేదు. కానీ తన అందం, అభినయంతో అందరినీ ఫిదా చేసిందని చెప్పాలి.
ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలుకా మూవీతో అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నారు భాగ్యశ్రీ. నవంబర్ 28వ తేదీన విడుదల కానున్న ఆ సినిమాలో రామ్ పోతినేని సరసన నటించిన ఆమె.. మరోసారి తన యాక్టింగ్ తో అలరించడం దాదాపు ఖాయమే. అదే సమయంలో ఆమె రిలేషన్ షిప్ గురించి కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
రామ్ పోతినేని- భాగ్యశ్రీ బొర్సే మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందంటూ కొంతకాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ షూటింగ్ టైమ్ లోనే ప్రేమలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో నిజం అనేది ఎవరికీ తెలియకపోయినా.. రూమర్స్ మాత్రం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి.
ఇప్పటికే ఆ విషయంపై పలుమార్లు పరోక్షంగా స్పందించిన భాగ్యశ్రీ బొర్సే.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తాను, రామ్ మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. అంతేకాదు రామ్ ను తాను ఆరాధిస్తానని చెప్పారు. ఆయన చాలా మంచి యాక్టర్ అంటూ ప్రశంసలు కురిపించారు. సినిమా కోసం కష్టపడి పని చేస్తారని కొనియాడారు.
ప్రస్తుతం భాగ్యశ్రీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. రూమర్స్ కు క్లియర్ గా చెక్ పడినట్లయింది. అయితే రీసెంట్ గా మరో ఇంటర్వ్యూలో తాను ఎవరితో లవ్ లో లేనని తెలిపారు. అయితే కన్ఫర్మ్ గా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు. దీంతో ప్రేమలో లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఎలా చెబుతున్నారని హోస్ట్ అడిగారు.
అప్పుడు తనకు ప్రేమ మీద విపరీతమైన విశ్వాసం ఉందని చెప్పిన భాగ్యశ్రీ.. ఎప్పటికైనా తనకు అర్థం చేసుకుని, నచ్చే వ్యక్తి జీవితంలోకి వస్తాడనే నమ్మకం ఉందని అన్నారు. అందుకే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రేమ విషయం దాస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కానీ ఇప్పుడు ఆమె రిలేషన్ షిప్ వార్తలపై స్పష్టత ఇచ్చారు.
