రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టారు. తాను కవిత్వం రాస్తానని, జీవితంలోని కష్టకాలంలో రాయడం తనకు ప్రశాంతతను ఇచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని తనలోనే దాచుకున్నానని, ఏదో ఒకరోజు తన కవితలను అందరితో పంచుకుంటానని తెలిపారు.
By: Madhu Reddy | 5 Nov 2026 12:33 PM ISTసినీ ఆడియన్స్ కలల రాకుమారిగా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది భాగ్యశ్రీ. అందం, అభినయంతో.. నటనతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తొలిసారి మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా రవితేజ సరసన హీరోయిన్గా నటించి తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రంలో నటించి.. పర్వాలేదనిపించుకున్న ఈమె.. రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో కూడా తన నటనతో ఆకట్టుకుంది. కానీ ఈమెకు మంచి గుర్తింపును అందించింది మాత్రం అఖిల్ లెనిన్ మూవీ అనే చెప్పాలి. ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమాతో భాగ్యశ్రీ కి మంచి పేరు రావడమే కాకుండా ఇతర భాషల్లో కూడా వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.
గ్లామర్ తో కట్టిపడేసిన భాగ్యశ్రీ బోర్సే..
ఇదిలా ఉండగా.. మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఈమె.. మరోసారి మరో ఔట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ గ్లామర్ ఫోజులతో పాటు తనలో దాగి ఉన్న రహస్యాన్ని కూడా అభిమానులతో పంచుకుంది భాగ్యశ్రీ. ముందుగా భాగ్యశ్రీ ధరించిన అవుట్ ఫిట్ విషయానికి వస్తే.. బ్లాక్ హాల్టర్ నెక్ మ్యాక్సీ డ్రెస్ ధరించింది. పొడవైన లాంగ్ మ్యాక్సీ డ్రెస్ కి మధ్యలో తెల్లటి జిగ్జాగ్ ఆకారంలో ఉండేలా కాంట్రాస్ట్ రిక్ రాక్ ట్రిమ్ డిజైన్ ను బోర్డర్ గా అమర్చారు. ఈ వెకేషన్ డ్రెస్ కి తగ్గట్టుగా మెడలో సన్నని లేయర్ బ్లాక్ అండ్ గోల్డ్ చౌకర్ నెక్లెస్ ను ధరించి తన క్యాజువల్ లుక్ ను ఆమె మరింత పర్ఫెక్ట్ గా మార్చుకుంది.
భాగ్యశ్రీ కవయిత్రి కూడానా..
ఇక ఈ బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ తో పాటు ఆమె పంచుకున్న రహస్యం అభిమానులను ఒకింత సర్ప్రైజ్ చేసిందని చెప్పాలి. భాగ్యశ్రీ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విధంగా క్యాప్షన్ జోడించింది. "ఒక రహస్యం బయటపెట్టే సమయం వచ్చింది. మీ అందరి నుండి నేను ఇన్ని రోజులు దాచిన ఈ రహస్యాన్ని ఇప్పుడు బయట పెట్టాల్సిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను. నాలో నేను ఎప్పుడూ నాలోనే దాచుకున్న ఒక చిన్న భాగం కవిత్వం. నేను కవిత్వం రాస్తాను. నా స్నేహితుల ముందు నన్ను నేను గర్వంగా కవిని అని పిలుచుకుంటాను. జీవితంలోని కష్టకాలంలో సహజంగానే నాలో ఈ భాగాన్ని నేను కనుగొన్నాను
కవిత్వం నాకు ప్రశాంతతను ఇచ్చింది..
రాయడం నాకు ప్రశాంతతను ఇచ్చింది. జీవితంలోని అందాలను కనుగొనేలా చేసింది. కవిత్వం రాసేటప్పుడు నన్ను నేను స్వేచ్ఛగా జీవించాలనుకుంటాను. ప్రపంచాన్ని మరిచిపోయి నా హృదయం చెప్పేది వింటూ.. నేను ఎవరో నాకు గుర్తుచేసే ఒక గొప్ప రహస్యం ఇది.. అందుకే బహుశా ఏదో ఒక రోజు ఈ కవయిత్రి తనలోని ఒక భాగాన్ని బయట ప్రపంచంలోకకి విడుదల చేస్తుంది. ఏదో ఒక రోజు నేను బయటకు చెప్పలేని ఎన్నో మాటలను మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటివరకు ఈ చిన్న కవయిత్రి ఒక వాగ్దానం కోరుతోంది. దయగా, సౌమ్యంగా ఉండమని.. కచ్చితంగా మీ ముందుకు నాలోని టాలెంట్ను తీసుకొస్తాను". అంటూ ఈమె చేసిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నటన, అందమే కాదు ఈమెలో ఒక కవయిత్రి కూడా దాగి ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
