కింగ్ డమ్ ఇలా చేశారేంటి బాసు..?
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా గురించి అంతా పాజిటివ్ టాక్ నడుస్తుంది.
By: Ramesh Boddu | 31 July 2025 3:32 PM ISTవిజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా గురించి అంతా పర్వాలేదు అనే టాక్ నడుస్తుంది. ఐతే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ చేశారన్న టాక్ ఉంది. ఐతే అదేమి సినిమా టాక్ కి ఎఫెక్ట్ చేయలేదు. ఐతే సినిమాలో నిరాశ పరచిన పాయింట్ మాత్రం ఒకటి ఉంది. అదే భాగ్య శ్రీ బోర్స్ రోల్. మిస్టర్ బచ్చన్ తో అమ్మడికి మంచి బజ్ రాగా విజయ్ కింగ్ డమ్ తో అమ్మడికి మంచి బ్రేక్ వస్తుందని అనుకున్నారు. కానీ కింగ్ డమ్ చూస్తే కరెక్ట్ గా చెప్పాలంటే భాగ్య శ్రీ సీన్స్ 3, 4 మాత్రమే ఉన్నాయి.
హీరో, హీరోయిన్య కెమిస్ట్రీ..
అసలు హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీనే కుదరలేదు. అంతేకాదు హృదయం లోపల సాంగ్ కూడా తీసేశారు. లెంగ్త్ ఎక్కువవుతుందని ఆ సాంగ్ తీసేసి ఉండొచ్చు కానీ కనీసం భాగ్య శ్రీ ఫ్యాన్స్ కోసం అయినా ఆ ఒక్క సాంగ్ ఉంచితే బాగుండేది. ఐతే గౌతం తన డీటైలింగ్ కి ఎక్కువ టైం తీసుకుని సినిమాలో ఈ సాంగ్ ని ట్రిమ్ చేశాడు. విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ ఇద్దరు లిప్ లాక్ చేసిన సీన్ కూడా ఆ పాటలో ఉంది.
సినిమా రిలీజ్ ముందు ఆ సాంగ్ తోనే ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ అయ్యింది. అలాంటిది సినిమాలో ఆ సీన్ లేకపోవడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో గౌతం తిన్ననూరి చేసిన ఈ ప్రయత్నం అయితే బాగానే ఉంది. ఐతే సినిమా ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది అనిపిస్తుంది.
సాంగ్ కూడా తీసేయడం ..
భాగ్య శ్రీ బోర్స్ సీన్స్ విషయంలో డైరెక్టర్ ఎలా ఆలోచించాడు అన్నది తెలియదు కానీ ఆమె సీన్స్ కూడా 2, 3 సూపర్ హిట్ అయిన సాంగ్ కూడా తీసేయడం కాస్త డిజప్పాయింట్ చేసింది. సినిమా ప్రమోషనల్ కు ఉపయోగపడిన ఈ సాంగ్ తీరా సినిమాలో లేకపోవడంపై మ్యూజిక్ లవర్స్ కూడా షాక్ అయ్యారు. మరి సినిమా టాక్ బాగుండి సాంగ్ కావాలని ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్ వస్తే తప్పకుండా యాడ్ చేస్తారేమో చూడాలి. మళ్లీరావా, జెర్సీ లాంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన గౌతం తిన్ననూరి కింగ్ డం లాంటి మాస్ సినిమా చేయడం గొప్ప అటెంప్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు డైరెక్టర్ ఈ విషయంలో మార్కులు కొట్టేశాడు.
