అయ్యో భాగ్యం ఎంత పనయ్యింది..?
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా చూసిన ఆడియన్స్ భాగ్య శ్రీ బోర్స్ విషయంలో చాలా అప్సెట్ అవుతున్నారు.
By: Ramesh Boddu | 31 July 2025 11:06 PM ISTవిజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా చూసిన ఆడియన్స్ భాగ్య శ్రీ బోర్స్ విషయంలో చాలా అప్సెట్ అవుతున్నారు. సినిమాలో భాగ్య శ్రీ ఉంది అంటే ఉందన్నట్టు తప్ప ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అసలు భాగ్య శ్రీకి ఇంత తక్కువ స్క్రీన్ టైం ఉంటుందని ఆడియన్స్ ఊహించలేదు. తెలుగులో ఆమెకిది రెండో సినిమానే.. రవితేజతో మిస్టర్ బచ్చన్ చేసింది భాగ్య శ్రీ. ఐతే ఆ సినిమాలో తన గ్లామర్ షోతో అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది.
హృదయం లోపల సాంగ్..
విజయ్ సినిమాలో భాగ్య శ్రీ ఛాన్స్ అనగానే సూపర్ అనుకున్నారు. ఇక సినిమా ప్రమోషనల్ గా వదిలిన హృదయం లోపల సాంగ్ అయితే సంథింగ్ క్యూరియస్ పెంచింది. కానీ సినిమాలో ఆ సాంగ్ కూడా లేదు. లెంగ్త్ ఎక్కువ అవుతుందనో లేదా సినిమా ఫ్లో మిస్ అవుతుంది అని ఆ సాంగ్ లేపేశారు. సినిమాలో భాగ్య శ్రీ సీన్స్ పట్టుమని 3, 4 తప్ప మరేవి ఉండవు.
మరి ఈమాత్రం దానికి భాగ్య శ్రీ ఎందుకు అనిపిస్తుంది. అంతేకాదు కింగ్ డమ్ తో అమ్మడు డబుల్ క్రేజ్ తెచ్చుకుంటుంది అనుకుంటే సినిమాలో ఆమె రోల్ చూసి నీరపడుతున్నారు. పెద్దగా ఇంప్రెస్ కూడా చేయలేకపోయింది భాగ్య శ్రీ. ఇదే కొనసాగితే మాత్రం భాగ్య శ్రీ కష్టమే అని చెప్పొచ్చు.
కింగ్ డమ్ మీద అమ్మడు కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. సినిమా టాక్ కూడా పర్వాలేదు గానే ఉంది. కానీ భాగ్య శ్రీ విషయంలో మాత్రం నిరుత్సాహంగా ఉన్నారు. భాగ్య శ్రీ బోర్స్ నెక్స్ట్ రాం తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేస్తుంది. కనీసం ఆ సినిమాలో అయినా భాగ్యానికి మంచి రోల్ పడితే బాగుంటుందని అనుకుంటున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా ఒక లవ్ స్టోరీ..
ఐతే ఆంధ్రా కింగ్ తాలూకా ఒక లవ్ స్టోరీ.. తప్పకుండా రామ్, భాగ్య శ్రీ జోడీ ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు. సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన నువ్వుంటె చాలే సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. సో కింగ్ డమ్ ని మర్చిపోయి భాగ్య శ్రీ ఫ్యాన్స్ ఆంధ్రా కింగ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఆంధ్రా కింగ్ తర్వాత భాగ్య శ్రీ బోస్ దుల్కర్ సల్మాన్, రానా చేస్తున్న కాంత సినిమా కూడా చేస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజైన విషయం తెలిసిందే.
