రామ్ పై భాగ్యశ్రీ ఆసక్తికర కామెంట్స్.. చూసి నేర్చుకోండయ్యా!
ఇకపోతే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మంచి టాక్ అందుకోవడంతో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో భాగ్యశ్రీ రామ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
By: Madhu Reddy | 7 Dec 2025 10:32 AM ISTప్రముఖ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో, అందంతో మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. రామ్ పోతినేనితో కలిసి ఇటీవల ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో నటించింది. అలా నవంబర్ 27న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచే రామ్ పోతినేనితో రిలేషన్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ఎఫైర్ రూమర్స్ కూడా వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లు అంటూ కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు తాజాగా రామ్ పోతినేని పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మంచి టాక్ అందుకోవడంతో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో భాగ్యశ్రీ రామ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. భాగ్యశ్రీ మాట్లాడుతూ.." రామ్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గానే ఆలోచిస్తాడు. రామ్ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ముఖ్యంగా సెట్స్ లో కూడా రామ్ పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాడు. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అంటూ భాగ్యశ్రీ తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ కామెంట్స్ విన్న నెటిజన్స్.. కొంతమంది సెలబ్రిటీలు ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు.. రామ్ ని చూసి నేర్చుకోండయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే రామ్ పై భాగ్యశ్రీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
భాగ్యశ్రీ విషయానికి వస్తే.. పూణే నగరానికి చెందిన ఈమె మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత నటిగా మారిన భాగ్య శ్రీ 2003లో వచ్చిన హిందీ చిత్రం యారియాన్ 2 అనే సినిమాతో అరంగేట్రం చేసింది. తర్వాత ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో 2024 లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది కూడా.
నైజీరియాలోని లాగోస్ లో చదువుకున్న ఈమె.. ఇండియా తిరిగి వచ్చి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకొని ఒక ఏజెన్సీ తో కలిసి పని చేసింది. అంతేకాదు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన ఈమె.. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. మిస్టర్ బచ్చన్ తర్వాత కింగ్డమ్ లో నటించిన ఈమె.. అలాగే తమిళ చిత్రం కాంత లో కూడా నటించింది. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
