ఎల్లో డ్రెస్‌లో 'భాగ్యం' మెరుపులు
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకునే నటి భాగ్యశ్రీ బోర్సే. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌ను పలకరించడం మాత్రం మర్చిపోరు.
By: M Prashanth | 4 Dec 2025 8:53 AM ISTసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకునే నటి భాగ్యశ్రీ బోర్సే. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌ను పలకరించడం మాత్రం మర్చిపోరు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. లేత పసుపు రంగు స్లీవ్‌లెస్ డిజైనర్ డ్రెస్‌లో అచ్చం సూర్యకాంతిలా మెరిసిపోతున్నారు.
"సన్‌షైన్ స్టేట్ ఆఫ్ మైండ్" అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్‌కు తగ్గట్లే, ఆమె మోము వెలిగిపోతోంది. ఆ సింపుల్ లుక్‌లో ఉన్న మెరుపులు చూసి ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు. నిజానికి కెరీర్ ఆరంభంలో భాగ్యశ్రీని ఇండస్ట్రీలో అందరూ కేవలం గ్లామర్ డాల్‌గానే చూశారు. ఆమె నటించిన 'మిస్టర్ బచ్చన్', ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన 'కింగ్డమ్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆమె కెరీర్ కష్టమే అని చాలామంది భావించారు.
ఆమె కేవలం పాటలకు, గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అవుతారని, నటన రాదనే విమర్శలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ ఆ విమర్శలన్నింటినీ ఆమె ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'కాంత' సినిమాతో తనలోని అసలైన నటిని బయటకు తీశారు. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా, అందులో భాగ్యశ్రీ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
గ్లామర్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి, ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయిన తీరు విమర్శకులను మెప్పించింది. గ్లామర్ పాత్రలే కాదు, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా చేయగలనని ఆ సినిమాతోనే నిరూపించుకున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాతో భాగ్యశ్రీ తన స్థాయిని పూర్తిగా మార్చుకున్నారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కేవలం అందంతోనే కాకుండా, అభినయంతోనూ మెప్పించి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన చూసి, ఈమె ఆ గ్లామర్ పాత్రలు వేసిన అమ్మాయేనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం భాగ్యశ్రీ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
