Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : బ్లాక్‌ లో కలర్‌ఫుల్‌గా ముద్దుగుమ్మ

రవితేజ హీరోగా వచ్చిన 'మిస్టర్ బచ్చన్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే.

By:  Ramesh Palla   |   11 Nov 2025 11:02 AM IST
పిక్‌ టాక్ : బ్లాక్‌ లో కలర్‌ఫుల్‌గా ముద్దుగుమ్మ
X

రవితేజ హీరోగా వచ్చిన 'మిస్టర్ బచ్చన్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. మొదటి సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్‌ను చవిచూసిన భాగ్యశ్రీ ఇండస్ట్రీలో ముందు ముందు ఆఫర్లు దక్కించుకుంటుందా అని అంతా అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఈ అమ్మడికి టాలీవుడ్‌లో మంచి ఫ్యూచర్‌ ఉందని కొందరు మిస్టర్ బచ్చన్‌ విడుదలకు ముందే ఊహించారు. ఆమె లుక్ పరంగా ఆకట్టుకోవడంతో పాటు, తనలోని తెలియని ఆకర్షణతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంటుందని అంతా భావించారు. అన్నట్లుగానే మిస్టర్‌ బచ్చన్‌ ఫ్లాన్‌ అయినా కూడా అంచనాలను తారు మారు చేసి కొత్త ఆఫర్లను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు, నటనతోనూ మెప్పించడం ద్వారా ఈ అమ్మడికి ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు తలుపు తడుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.





ఆంధ్రా కింగ్‌ తాలూక మూవీ...

ఈ ఏడాదిలో రామ్‌ హీరోగా రూపొందిన ఆంధ్రా కింగ్‌ తాలూక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజతో ఆ సమయంలో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు రామ్‌ కు జోడీగా కూడా చూడముచ్చటగా ఉంది అనిపించుకుంటుంది. అందుకే ఆంధ్రా కింగ్‌ తాలూక సినిమా తర్వాత మరిన్ని ఆఫర్లు ఈ అమ్మడు అందుకుంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు రామ్‌ తో ఈ సినిమాలో నటిస్తూనే మరో వైపు తమిళ్‌ లో కాంతా సినిమాలో నటిస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా రూపొందుతున్న ఆ సినిమాలో హీరోయిన్‌గా ఈ అమ్మడు నటించడం ద్వారా అక్కడ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు, ఈ రెండు సినిమాల్లో నటనతో మెప్పిస్తే తప్పకుండా ఈ అమ్మడు పాన్ ఇండియా రేంజ్‌ లో వరుస విజయాలు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.





విజయ్‌ దేవరకొండతో భాగ్యశ్రీ బోర్సే...

ఈ ఏడాదిలో ఇప్పటికే విజయ్‌ దేవరకొండతో కలిసి కింగ్‌డమ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. అయితే సోషల్‌ మీడియాలో ఈమె రెగ్యులర్‌గా షేర్‌ చేసే ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా అమ్మడు షేర్‌ చేసిన ఈ బ్లాక్ కలర్‌ చీర కట్టు ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అని మరోసారి నిరూపితం అయింది. బ్లాక్‌ చీర కట్టులో ఈ అమ్మడు కలర్‌ ఫుల్‌గా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందం ఉంది కనుకే ఈ అమ్మడికి వరుస ఫ్లాప్స్ పడ్డా కూడా ఆఫర్లు వస్తున్నాయి అనేది మరికొందరి అభిప్రాయం. మొత్తానికి చీర కట్టులో ఈ అమ్మడు మరోసారి కుర్రకారు గుండెజారి గల్లంతు అయ్యేలా చేసింది అంటూ నెటిజన్స్‌ కామెంట్‌.





అందాల చీర కట్టులో భాగ్యశ్రీ అందం..

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్‌లో జన్మించిన భాగ్యశ్రీ ఏడు సంవత్సరాల పాటు నైజీరియాలోని లాగోస్‌లో నివసించింది. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చింది. ముంబైలో మోడలింగ్‌ను మొదలు పెట్టడం ద్వారా ఇండస్ట్రీలోకి రావడానికి అడుగులు వేసింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. మొదటి సారిగా హిందీలో ఈ అమ్మడికి యారియన్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడకున్నా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మరో హిందీ మూవీ చందు ఛాంపియన్‌ లోనూ ఈమె నటించింది. ఆ సినిమా సైతం ఈమెకు నటిగా గుర్తింపు తెచ్చి పెట్టింది. కానీ హిందీ ఇండస్ట్రీ ఈమెను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో సౌత్‌ వైపు ఈ అమ్మడి చూపు పడింది. లక్కీగా రవితేజకు జోడీగా మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.