ఈ సారైనా భాగ్యశ్రీ ఆశలు ఫలిస్తాయా?
దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా, రామ్ పోతినేనితో ఓ సినిమాను లైన్ లో పెట్టి ఇప్పుడు ఆ రెండు సినిమాలనూ ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది భాగ్యశ్రీ.
By: Sravani Lakshmi Srungarapu | 12 Nov 2025 4:15 AM ISTరీసెంట్ టైమ్స్ లో తెలుగు తెరకు పరిచయమైన అందాల హీరోయిన్ల లిస్ట్ లో భాగ్యశ్రీ బోర్సే ముందుంటుంది. పాలరాతి బొమ్మలా ఉండే భాగ్యశ్రీ కలువల్లాంటి కళ్లతో ఎన్నో కబుర్లు చెప్పగలదు. భాగ్యశ్రీ ఎంతో గొప్ప అందగత్తె అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీతో భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.
రెండు ఫ్లాపులొచ్చినా అవకాశాలు
ఆ సినిమా ఫ్లాపైనా అందులో అమ్మడి అందం, అందాల ఆరబోత, డ్యాన్సులు భాగ్యశ్రీకి అవకాశాలను తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన కింగ్‌డమ్ మూవీ కూడా భాగ్యశ్రీకి తన స్టార్‌డమ్ పెంచుకోవడానికి ఉపయోగపడలేదు. మొదటి రెండు సినిమాలూ ఫ్లాపైనా కానీ ఆమెకు అవకాశాలు మాత్రం ఆగిపోలేదు.
నవంబర్ 14న కాంత
దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా, రామ్ పోతినేనితో ఓ సినిమాను లైన్ లో పెట్టి ఇప్పుడు ఆ రెండు సినిమాలనూ ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది భాగ్యశ్రీ. వాటిలో ముందుగా దుల్కర్ తో చేసిన కాంత నవంబర్ 14న రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ బైలింగ్యువల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీకి మంచి పాత్ర దక్కిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
కాంతతో భాగ్యశ్రీ కోలీవుడ్ ఎంట్రీ
పైగా కాంత మూవీతోనే భాగ్యశ్రీ తమిళ ఆడియన్స్ కు పరిచయం కాబోతుంది. తమిళంలో తాను ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమా తనకు మంచి సక్సెస్ ను అందిస్తుందని కాంతపై భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వాస్తవానికి భాగ్యశ్రీ, కాంత ప్రాజెక్టుతోనే లాంచ్ అవాల్సిందని, అందరికంటే భాగ్యశ్రీని ముందుగా గుర్తించింది తామేనని మొన్న కాంత ఈవెంట్ లో రానా కూడా చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల కాంత లేటవగా, మిగిలిన సినిమాలు ముందొచ్చాయి.
ట్రైలర్ చూస్తుంటే కాంత సినిమాలో భాగ్యశ్రీకి చాలా మంచి పాత్ర దక్కినట్టే అనిపిస్తుంది. కాంతతో మొదటి హిట్ ను అందుకుని, ఆ తర్వాత నవంబర్ నెలాఖరుకి ఆంధ్రా కింగ్ తాలూకాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకుని బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకోవాలని భాగ్యశ్రీ చాలా ఆశపడుతుంది. మరి అమ్మడి ఆశలు ఈసారైనా తీరుతాయో లేదో చూడాలి.
