బచ్చన్ పాపకు నవంబర్ పరీక్షలు
ఈ రెండు సినిమాలూ సక్సెస్ అవకపోయినా భాగ్యశ్రీకి టాలీవుడ్ లో అవకాశాల పరంగా కొరత లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 5 Nov 2025 7:00 PM ISTమాస్ మహారాజా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీతో తన గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరి మనసుల్నీ ఎట్రాక్ట్ చేసిన భామ భాగ్యశ్రీ బోర్సే. నటిగా మిస్టర్ బచ్చన్ తో అరంగేట్రం చేసిన భాగ్యశ్రీ, రెండో సినిమాగా విజయ్ దేవరకొండతో కలిసి కింగ్‌డమ్ చేసింది. ఈ రెండు సినిమాలూ సక్సెస్ అవకపోయినా భాగ్యశ్రీకి టాలీవుడ్ లో అవకాశాల పరంగా కొరత లేదు.
తన అందం, అభినయం కారణంగా భాగ్యశ్రీ కి వరుస ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే తన వద్దకు వచ్చిన ఆఫర్లను అందుకున్న భాగ్యశ్రీ ఇప్పుడు నవంబర్ లో చాలా పెద్ద పరీక్షనే ఎదుర్కోబోతుంది. అమ్మడు నటించిన సినిమాలు రెండు వారాలా గ్యాప్ లో వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కాంత సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
నవంబర్ 14న కాంత రిలీజ్
కాంత సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, మలయాళ భాషల్లో దుల్కర్ కు మంచి క్రేజ్ ఉండటంతో ఈ పీరియాడికల్ డ్రామాపై విపరీతమైన బజ్ నెలకొంది. కాంత మూవీలో భాగ్యశ్రీ నటిగా కనిపించనుండగా, ఈ క్యారెక్టర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుని మంచి రిజల్ట్ అందుకోవాలని చూస్తోంది భాగ్యశ్రీ. అదే జరిగితే కాంత సినిమా భాగ్యశ్రీ ఖాతాలో తొలి హిట్ గా నిలుస్తుంది.
కాంత రిలీజైన తర్వాత నవంబర్ లోనే భాగ్యశ్రీ నుంచి మరో సినిమా రానుంది. అదే ఆంధ్రా కింగ్ తాలూకా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఓ హీరో అభిమాని జీవితం ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ ఓ ఎనర్జిటిక్ రోల్ లో కనిపించనుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయితే అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్ కు అమ్మడు కనెక్ట్ అవుతుంది. పైగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆంధ్రా కింగ్ తాలూకాపై మంచి అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలతో మంచి ఫలితాల్ని అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది భాగ్యశ్రీ. వీటిలో ఏ ఒక్క సినిమా హిట్టైనా భాగ్యశ్రీ కెరీర్ కు బూస్టప్ దక్కినట్టే. మరి నవంబర్ నెల అమ్మడికి ఏ మేర కలిసొస్తుందో చూడాలి.
