పిక్‌టాక్ : అందాల భాగ్యం క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్
గత ఏడాది రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే.
By: Ramesh Palla | 15 Aug 2025 12:41 PM ISTగత ఏడాది రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. ఈ అమ్మడు హిందీ చిత్రం యూరియాన్ 2 తో 2023 లో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడకున్నా కూడా గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత కొన్ని సంస్థలకు మోడలింగ్ చేయడం ద్వారా దర్శకుడు హరీష్ శంకర్ దృష్టిలో పడింది. నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదివింది. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. పలు కంపెనీలతో కలిసి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ ద్వారా ఈమెకు మంచి ఫాలోయింగ్ దక్కింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో భాగ్యశ్రీ బోర్సే
యాడ్స్ ద్వారా వచ్చిన గుర్తింపు కారణంగా సినిమాల్లో ఆఫర్లు దక్కాయి. రెండేళ్లుగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడికి సరైన బ్రేక్ దక్కలేదు. హిందీలో రెండు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలు చేసిన భాగ్యం ఇప్పటి వరకు మంచి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. అయితే సినిమా సినిమాకు నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు స్టార్ హీరోల సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క సినిమాలు ఏమీ లేవు. కానీ రెండు మూడు చర్చల దశలో ఉన్నాయి. ఇటీవలే ఈమె కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భాగ్యశ్రీ రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
మేకప్ లేకుండానే చాలా అందంగా భాగ్యశ్రీ
వైట్ స్లీవ్‌లెస్ టాప్ ను ధరించిన భాగ్యశ్రీ ఒక రెస్టారెంట్‌లో కూల్ అండ్ స్వీట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఆకట్టుకుంది. సింపుల్ అండ్ క్యూట్ లుక్‌లో భాగ్యశ్రీ చాలా అందంగా ఉందని నెటిజన్స్ అంటున్నారు. సాధారణంగా చాలా మంది హీరోయిన్స్ మినిమం మేకోవర్ అయితే తప్ప బయటకు రారు. కానీ ఈమె మాత్రం మేకప్ లేకుండానే బయటకు వచ్చింది, మేకప్ లేకున్నా ఈమె చాలా అందంగా ఉందని నెటిజన్స్ అంటున్నారు. సినిమాల్లో చూసిన దానికంటే ఇలాగే మరింత అందంగా ఉందని కొందరు అంటున్నారు. మొత్తానికి భాగ్యశ్రీ అందం ఓ రేంజ్ లో ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ముందు ముందు మరిన్ని అందమైన ఫోటోలను షేర్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించాలి
సాధారణంగానే భాగ్యశ్రీ బోర్సే చాలా క్యూట్‌గా ఉంటుంది. అలాంటి భాగ్యశ్రీ ఇలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి మరింత క్యూట్‌గా ఉందని, చూపు తిప్పలేక పోతున్నామని అంటున్నారు. ఇలాంటి సింపుల్ రొటీన్ లుక్ కి, ఫోటోలకు పెద్దగా రెస్పాన్స్ రాదు. కానీ భాగ్యశ్రీ అందంగా కనిపించడంతో పాటు, చాలా క్యూట్‌గా ఉండటంతో అంతా కూడా తెగ లైక్ చేస్తూ ఈ పోటోలను షేర్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న భాగ్యశ్రీకి లక్ కలిసి వచ్చి మరింతగా అవకాశాలు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముందు ముందు భాగ్యశ్రీ టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ అమ్మడు తదుపరి సినిమా ఏంటి, ఎప్పుడు ఉంటుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
