ఆంధ్రా కింగ్ అయినా అమ్మడికి సక్సెస్ రుచి చూపిస్తాడా?
భాగ్యశ్రీ బోర్సే. అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్న నటి. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంటరైన అందమైన భామల్లో భాగ్యశ్రీ బోర్సే కూడా ఒకరు.
By: Sravani Lakshmi Srungarapu | 16 Nov 2025 12:00 PM ISTభాగ్యశ్రీ బోర్సే. అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్న నటి. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంటరైన అందమైన భామల్లో భాగ్యశ్రీ బోర్సే కూడా ఒకరు. గతేడాది రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీతో భాగ్యశ్రీ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా భాగ్యశ్రీ బోర్సే కి నిరాశనే మిగిల్చింది.
నిరాశను మిగిల్చిన మిస్టర్ బచ్చన్, కింగ్‌డమ్
మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం యావరేజ్ గా కూడా కాకుండా డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ ఆ సినిమాలో భాగ్యశ్రీ నటనకు, డ్యాన్సులకు మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా కింగ్‌డమ్ మూవీలో నటించింది. కింగ్‌డమ్ సినిమా అయినా తనకు మంచి సక్సెస్ ను ఇస్తుందనుకుంటే ఆ సినిమా కూడా ఫ్లాపుగా నిలవడంతో మరోసారి అమ్మడి ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.
ఒకే నెలలో రెండు సినిమాలు..
కెరీర్లో వరుసగా రెండు ఫ్లాపులు పడటంతో భాగ్యశ్రీ కెరీర్ ఆ తర్వాతి సినిమాల ఫలితాలపై ఆధారపడింది. కింగ్‌డమ్ తర్వాత అమ్మడు కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల్లో నటించగా, ఈ రెండు సినిమాలూ ఒకే నెలలో రెండు వారాల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో తాజాగా కాంత సినిమా రిలీజైంది. కాంత సినిమా రిలీజ్ కు ముందు అమ్మడు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.
కాంతలో నటనకు మంచి ప్రశంసలు
కానీ ఎవరూ కాంత మూవీకి అనూహ్య స్పందన రావడంతో కాంతకు బాక్సాఫీస్ ట్రెండ్స్ కూడా ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. కాంత మూవీకి ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, ఈ మూవీలో అమ్మడి యాక్టింగ్ కు మాత్రం మంచి ప్రశంసలే వస్తున్నాయి. కొన్ని సీన్స్ లో భాగ్యశ్రీ తన యాక్టింగ్ తో దుల్కర్ సల్మాన్ ను కూడా డామినేట్ చేసిందని ఓ వర్గం ఆడియన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ అమ్మడిని ప్రశంసిస్తున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా పైనే ఆశలన్నీ!
అయితే యాక్టింగ్ పరంగా భాగ్యశ్రీ మొదటి సినిమా నుంచే మంచి మార్కులే వేయించుకుంటుంది. కానీ ఇప్పటివరకు అమ్మడికి సరైన కథ పడకపోవడంతో భాగ్యశ్రీ ఇప్పటికీ సక్సెస్ రుచి చూడలేకపోయింది. దీంతో ఇప్పుడు భాగ్యశ్రీ ఆశలన్నీ రామ్ పోతినేనితో చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా పైనే ఉన్నాయి. కనీసం ఈ సినిమాకు అయినా మంచి టాక్ తెచ్చుకుని తనకు సక్సెస్ ను రుచి చూపిస్తుందని అమ్మడు ఎంతో ఆశగా ఉంది. నవంబర్ 28న రిలీజ్ కానున్న ఆంధ్రా కింగ్ తాలూకా సక్సెస్ అటు హీరో కు కూడా ఎంతో కీలకం అనే విషయం తెలిసిందే.
