Begin typing your search above and press return to search.

సావిత్రి, శ్రీదేవిలను చూసి నేర్చుకున్నా: 'కాంత' బ్యూటీ

ఈ క్యారెక్టర్ దొరకడం లక్ అయినా, దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుందట. 'కాంత' కథ 1960ల బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది.

By:  M Prashanth   |   11 Nov 2025 9:50 PM IST
సావిత్రి, శ్రీదేవిలను చూసి నేర్చుకున్నా: కాంత బ్యూటీ
X

దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి.. ఇలా ఇద్దరు బడా స్టార్స్ నటిస్తున్న 'కాంత' సినిమాపై బజ్ మెల్లగా పెరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్‌లో తన లుక్స్‌తో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన కొత్త బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాలో ఈమె 'కుమారి' అనే ఒక కీలకమైన, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది. అసలు ఈ సినిమాతో తన ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేదానిపై ఆమె రీసెంట్‌గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

నిజానికి, ఆడియన్స్ భాగ్యశ్రీని ఇదివరకే రెండు తెలుగు సినిమాల్లో చూసేశారు. కానీ, ఆమె కెమెరా ముందు నిలబడటానికి, అసలు ఇండస్ట్రీకి రావడానికి కారణమైన ఫస్ట్ ప్రాజెక్ట్ మాత్రం 'కాంత'నే. "ఒక కొత్త నటిగా ఇండస్ట్రీలోకి వస్తూనే, 'కుమారి' లాంటి ఇంత పవర్‌ఫుల్, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర దొరకడం నా లక్. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్" అని భాగ్యశ్రీ అంటోంది.

ఈ క్యారెక్టర్ దొరకడం లక్ అయినా, దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుందట. 'కాంత' కథ 1960ల బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. ఆ టైమ్ పీరియడ్‌ను, ఆనాటి అమ్మాయిల బాడీ లాంగ్వేజ్‌ను పట్టుకోవడం కోసం ఈ బ్యూటీ గట్టిగానే గ్రౌండ్‌వర్క్ చేసిందట. "ఆ టైమ్ కి తగ్గ ఫీల్ తేవడం కోసం నేను లెజెండరీ యాక్టర్స్ సావిత్రి గారు, శ్రీదేవి గారి పర్ఫార్మెన్స్‌లను బాగా అబ్జర్వ్ చేశాను. వాళ్ల నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకుని, 'కుమారి' పాత్రకు నా ఓన్ వెర్షన్‌ను క్రియేట్ చేశాను" అని చెప్పింది.

ఈ సినిమాకు, ముఖ్యంగా 'కుమారి' పాత్రకు ఇంత మంచి పేరు రావడానికి కారణం డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ అని భాగ్యశ్రీ అంటోంది. "సెల్వమణి చాలా టాలెంటెడ్, కైండ్ హార్టెడ్ పర్సన్. ఆయన ఎంత మంచివాడో, ఆయన రైటింగ్ కూడా అంతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. 'కుమారి' పాత్రను ఆయన రాసిన తీరు చూసి నేనే ఆశ్చర్యపోయాను. యాక్టర్ల నుంచి బెస్ట్ అవుట్‌పుట్ ఎలా రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు" అంటూ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించింది.

ఇలాంటి ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్‌ను చేయడం ఒకెత్తయితే, మొదటి సినిమాలోనే దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి లాంటి ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో స్పెషల్ ఫీలింగ్ అని భాగ్యశ్రీ అంటోంది. ఈ కాంబినేషన్ తన కెరీర్‌కు బిగ్గెస్ట్ బూస్ట్ ఇస్తుందని ఆమె నమ్ముతోంది.

చాలా మంది హీరోయిన్లకు గ్లామర్ రోల్స్ వస్తాయి కానీ, పెర్ఫార్మెన్స్ చూపించే ఛాన్స్ రావడం అరుదు. "నా టాలెంట్‌ను నిజంగా షోకేస్ చేసే అవకాశం 'కాంత' ఇచ్చింది. ఈ ఒక్క సినిమా చాలు, ఒక యాక్టర్‌గా నాకు ఇది మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది" అని భాగ్యశ్రీ బోర్సే చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తోంది. మరి 'కుమారి'గా ఈ కొత్త బ్యూటీ ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.