Begin typing your search above and press return to search.

లెజెండ్‌తో స్క్రీన్‌ పంచుకోబోతున్న భాగ్యశ్రీ.. పోస్ట్ వైరల్

ఈ చిత్రంలో మోహన్‌లాల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, ఆదిల్ హుస్సేన్ మరియు పార్థిబన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

By:  Madhu Reddy   |   1 Oct 2026 1:15 PM IST
లెజెండ్‌తో స్క్రీన్‌ పంచుకోబోతున్న భాగ్యశ్రీ.. పోస్ట్ వైరల్
X

సౌత్ సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మలయాళంలోకి గ్రాండ్‌గా అడుగుపెడుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, నేషనల్ అవార్డు గ్రహీత విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఆపరేషన్ గంగా'లో ఆమె నటిస్తోంది. తాజాగా మోహన్‌లాల్‌‌తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం..

చారిత్రాత్మక రెస్క్యూ ఆపరేషన్ కథాంశం:

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు మరియు పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక 'ఆపరేషన్ గంగ' ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇక దేశభక్తి మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగే ఈ కథపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'శ్రీ గోకులం మూవీస్' బ్యానర్‌పై గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

స్టార్ కాంబినేషన్‌తో క్రేజీ ప్రాజెక్ట్:

ఈ చిత్రంలో మోహన్‌లాల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, ఆదిల్ హుస్సేన్ మరియు పార్థిబన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందిస్తుండగా, సౌత్ కొరియన్ స్టంట్ డైరెక్టర్ ఓ సే-యెంగ్ యాక్షన్ సీక్వెన్స్‌‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు.

మోహన్‌లాల్‌పై భాగ్యశ్రీ ప్రశంసల జల్లు:

ఇటీవల 'లెనిన్' సినిమాతో కెరీర్‌లో తొలి భారీ హిట్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే, ఈ సక్సెస్ జోష్‌‌లోనే మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. మోహన్‌లాల్‌తో కలిసి పనిచేస్తున్న అనుభూతిని పంచుకుంటూ సోషల్ మీడియాలో ఆయనతో ఉన్న పిక్‌ను షేర్ చేసింది. "ప్రియమైన మోహన్ లాల్ సార్, మీతో పని చేయడం నాకు ఎంతో గొప్ప అవకాశం.. ప్రతి రోజూ షూటింగ్‌లో మీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. మీరు నిజంగా అద్భుతమైన టాలెంట్ సార్" అంటూ తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఫాన్స్ కూడా ఈ క్రేజీ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.

దిగ్గజ నటుడు మోహన్‌లాల్ పక్కన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోవడం భాగ్యశ్రీ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. 'ఆపరేషన్ గంగా' సినిమాతో ఆమె మలయాళంలోనూ తన సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. లెనిన్ సక్సెస్ తర్వాత వస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ భాగ్యశ్రీ రేంజ్‌ను మరింత పెంచడం ఖాయం.