Begin typing your search above and press return to search.

శ్రీ లీల, బాలయ్య, అనిల్ కలిస్తే అరుపులు కేకలే

త‌మ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మొత్తం క‌లిసి దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 Aug 2025 3:29 PM IST
శ్రీ లీల, బాలయ్య, అనిల్ కలిస్తే అరుపులు కేకలే
X

కేంద్ర ప్ర‌భుత్వం 71వ నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌గా అందులో తెలుగు సినిమాలు స‌త్తా చాటాయి. ప‌లు విభాగాల్లో పుర‌స్క‌రాల‌ను గెలుచుకుని తెలుగు సినిమా స్థాయిని మ‌రింత పెంచాయి. అందులో భాగంగానే ఉత్త‌మ తెలుగు చిత్రంగా భ‌గ‌వంత్ కేస‌రి ఎంపికైంది. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది.


ఆ గౌర‌వం చిత్ర యూనిట్‌కే ద‌క్కాలి

బాల‌కృష్ణ న‌ట‌న‌, అనిల్ డైరెక్ట‌ర్ తో పాటూ అందులో ఉన్న మెసెజ్ ఆడియ‌న్స్ కు విప‌రీతంగా న‌చ్చాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించిన ఈ సినిమా నేష‌న‌ల్ అవార్డు అందుకోవ‌డం అటు చిత్ర యూనిట్ తో పాటూ ఫ్యాన్స్ కు కూడా ఎంతో ఆనందాన్ని క‌లిగించింది. నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చింద‌నే గౌర‌వం త‌మ చిత్ర యూనిట్‌కే ద‌క్కుతుంద‌ని బాల‌కృష్ణ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ తెలిపారు.


త‌మ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మొత్తం క‌లిసి దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెల‌బ్రేష‌న్స్ లో నంద‌మూరి బాల‌కృష్ణ తో పాటూ సినిమాలో విజ్జి పాప‌గా కీల‌క పాత్ర‌లో న‌టించిన శ్రీలీల, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మ‌రియు చిత్ర నిర్మాత సాహు గార‌పాటి పాల్గొన‌గా ప్ర‌స్తుతం ఆ సెల‌బ్రేష‌న్స్ కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.