హీరోయిన్లు రైటర్లు అవుతోన్న వేళ!
వెండి తెరపై హీరోయిన్లు మాత్రమే కాదు. అవసరం మేర కలం పట్టి రచయితలు అయిన నటీమణులు కొందరున్నారు.
By: Srikanth Kontham | 3 March 2026 12:15 PM ISTవెండి తెరపై హీరోయిన్లు మాత్రమే కాదు. అవసరం మేర కలం పట్టి రచయితలు అయిన నటీమణులు కొందరున్నారు. భానుమతీ రామకృష్ణ తెలుగు సినిమా చరిత్రలో బహుముఖ ప్రజ్ఞాశాలి. భానుమతి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. రచయిత్రి గాను సేవలందించారు. తన ఆత్మకథ 'నాలో నేను' తో పాటు అనేక కథలు, పాటలు రాశారు. ఆమె రాసిన 'అత్తగారి కథలు' అప్పట్లో ఎంతో ప్రసిద్ధి. బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు హనీ ఇరానీ. అటుపై హీరోయిన్ గా, అనంతరం ఇండియాలోనే టాప్ స్క్రీన్ రైటర్లలో ఒకరిగా ఎదిగారు.
'లమ్హే', 'ఐనా', 'డర్', 'కహో నా ప్యార్ హై', 'క్రిష్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలు అందించారు. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రతిభావంతురాలైన నటి కొంకణా సేన్. 'ఏ డెత్ ఇన్ ద గంజ్' సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. సౌత్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన సుహాసిని మణిరత్నం కూడా రచయిత్రిగా ముద్ర వేసారు. 'తిరుడా తిరుడా', 'ఇద్దరు' సినిమాలకు డైలాగ్స్ రాయడంలో సహకరించారు. బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ కూడా రైటర్ గా, దర్శకురాలిగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. కల్కి కోచ్లిన్ వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాదు రచయిత్రిగా కూడా గుర్తింపు పొందారు.
'ద గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్' సినిమాకు కో-రైటర్‌గా పని చేశారు. వీరి బాటలోనే నవతరం నటీమణులు కెరీర్ ని నిర్దేశించుకుని ప్రయాణం ముందుకు సాగిస్తున్నారు. కీర్తి సురేష్ ఇప్పటికే సౌత్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. అంతేనా కెప్టెన్ కుర్చీ ఎక్కడానికి అమ్మడు సిద్దమవుతుంది. ఈ క్రమంలో సొంత కథలు రాయడం మొదలు పెట్టింది. సరైన కథ సిద్దమైన తర్వాత దర్శకురాలిగానూ మారడానికి రెడీ అవుతోంది. అలాగే సమంత సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా డైరెక్షన్ , రైటింగ్ టీమ్తో ఎన్నో స్క్రిప్ట్ డిస్కషన్స్ లో పాల్గొంటుంది. అవసరమైన సూచనలు, సలహాలు క్రియేటివ్ గా అందించే ప్రయత్నం చేస్తుంది. తాను కూడా సొంతంగా కథలు రాసే ఆలోచనలో ఉంది. మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ శ్రుతి హాసన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటిగా, గాయనిగా, మ్యూజిషియన్ గా సత్తా చాటుతుంది. అవసరం మేర సాహితి వేత్తగానూ మారిపోతుంది. ఇందులో మరింత ప్రోఫెషనల్ కావాలను కుంటుంది.
డాడ్ కమల్ హాసన్ తరహాలో స్క్రిప్ట్ లు కూడా రాయాల నుకుంటోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే నటిగా సత్తా చాటింది. 'సరస్వతి' సినిమాతో దర్శకురాలిగానూ ఎంట్రీ ఇస్తుంది. సక్సెస్ అయిందంటే? కెప్టెన్ కుర్చీని కంటున్యూ చేసే అవకాశాలున్నాయి. అలాగే మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రైటర్ గా మారే ఆలోచనలో ఉంది.
