కాంతారా క్లైమాక్స్.. సినిమాలు వదిలేస్తా..!
ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో బెల్లంకొండ హీరో కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By: Ramesh Boddu | 10 Sept 2025 9:30 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్యనే భైరవం సినిమాతో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమాతో ఆశించిన ఫలితం అందుకోలేదు. ఐతే లేటెస్ట్ గా ఈ హీరో కిష్కిందపురి సినిమాతో వస్తున్నాడు. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాపై హీరో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కౌశిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన కిష్కిందపురి సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఫిమేల్ లీడ్ గా నటించింది.
బెల్లంకొండ హీరో భారీ స్టేట్మెంట్స్..
ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో బెల్లంకొండ హీరో కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిష్కిందపురి ఆల్ ప్యాక్డ్ హారర్ మూవీ అని.. సినిమా మొదలైన 10 నిమిషాల్లోనే ఆడియన్స్ అందులో లీనమవుతారని అన్నాడు. అంతేకాదు 10 నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ చూస్తే తాను సినిమాలు వదిలేస్తా అని చెప్పాడు. ఇలాంటి భారీ స్టేట్మెంట్స్ వల్ల ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగేలా చేసినా ఒకవేళ సినిమాలో అంత మ్యాటర్ లేకపోతే మాత్రం అంతకంత ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఇదే కాదు కిష్కిందపురి సినిమా క్లైమాక్స్ కాంతారా రేంజ్ లో ఉంటుందని కూడా అంటున్నాడు బెల్లంకొండ హీరో. సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఉంది. కానీ మరీ కాంతారాతో పోల్చేంత సీన్ ఉందా అన్న డౌట్ మొదలైంది. కిష్కిందపురితో బెల్లంకొండ హీరోకి తప్పనిసరిగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి. ప్రమోషన్స్ లో భారీ స్టేట్మెంట్స్ ఇవ్వడం వరకు ఓకే కానీ దాన్ని మోసే కథాబలం ఇంకా స్క్రీన్ ప్లే చూపించాలి. అలా ఉండకపోతే మాత్రం రివర్స్ అవుతుంది.
సినిమాలు మానేస్తా..
ముఖ్యంగా సినిమాలు మానేస్తా అనే స్టేట్మెంట్స్ ఇవ్వడం షాకింగ్ గానే ఉంటుంది. యువ హీరోల్లో తన పంథాలో తన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు బెల్లంకొండ హీరో. మధ్యలో బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఐతే ప్రస్తుతం తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టిన ఈ హీరో నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. అల్లుడు శీను సినిమాతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీను మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు హిందీ యూట్యూబ్ ఛానెల్స్ లో చాలా రికార్డులు సాధించింది. ఆ క్రేజ్ తోనే హిందీలో బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ చేసేలా ప్రోత్సహించింది. ఐతే అది చేశాక ఎంత మిస్టేక్ చేశాడన్నది అర్ధమైంది.
అదే కాదు రీసెంట్ గా వచ్చిన భైరవం సినిమా కూడా తమిళ సినిమా గరుడన్ కి రీమేక్ గా వచ్చింది. భైరవం రిజల్ట్ చూసిన తర్వాత ఇక మీదట ఫ్యూచర్ లో రీమేక్ జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్.
