'తలుపులు తెరవబడ్డాయ్'.. బెల్లంకొండ కిష్కింధపురి టీజర్ చూశారా?
అదే సమయంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్ లో ఉండి.. ఆడియన్స్ ను విపరీతంగా ఆకర్షించాయి.
By: M Prashanth | 15 Aug 2025 4:58 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మరోసారి శ్రీనివాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన రాక్షసుడు మూవీ రాగా, ఇప్పుడు మరోసారి కిష్కింధపురితో సందడి చేయనున్నారు.
మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న కిష్కింధపురిని చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరగుతుండగా.. మేకర్స్ సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
అదే సమయంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్ లో ఉండి.. ఆడియన్స్ ను విపరీతంగా ఆకర్షించాయి. ఇప్పుడు తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ ప్రియులను తెగ మెప్పిస్తోంది.
హారర్ మ్యూజిక్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఓ రూమ్ లో చిన్నపాప ఉండగా.. తలుపులు సౌండ్ చేస్తుంటాయి. ఆ తర్వాత చిన్నారి మిస్ అవుతుంది. అప్పుడే నమస్కారం.. ఈరోజు శుక్రవారం.. 9- 8 -1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయ్.. పునః ప్రసారాలు నేటితో మొదలవుతాయి అంటూ బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్ వస్తుంది.
ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సీరియల్ లుక్ లో కనిపిస్తారు. రహస్యాన్ని చేధించే వ్యక్తి రోల్ పోషిస్తున్నట్లు ఉన్నారు. అయితే టీజర్ లో పాత భవనం, భయానక స్థితిగతులు, మనిషి సజీవదహనవ్వడం, బస్సు కాలిపోవడం వంటి ఘటనలు చూపించారు మేకర్స్. తద్వారా సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని డైరెక్టర్ సృష్టించినట్లు అర్థమవుతోంది
చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కథాంశానికి కరెక్ట్ గా సరిపోయినట్లు అనిపిస్తోంది. సాహు గారపాటి నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. గ్రిప్పింగ్ హారర్ మిస్టరీగా రూపొందుతున్న సినిమా టీజర్ ఓవరాల్ గా గూస్ బంప్స్ తెప్పిస్తోందని చెప్పాలి. సినిమాపై అంచనాలు కూడా పెంచుతోంది. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
