Begin typing your search above and press return to search.

చాలాసార్లు నెగిటివ్ వైబ్రేష‌న్స్ ఫేస్ చేసా

ఛ‌త్ర‌ప‌తి బాలీవుడ్ రీమేక్ పేరుతో మూడేళ్ల త‌న ప్రైమ్ టైమ్ ను వృధా చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్ గా భైర‌వం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 Sept 2025 1:01 PM IST
చాలాసార్లు నెగిటివ్ వైబ్రేష‌న్స్ ఫేస్ చేసా
X

ఛ‌త్ర‌ప‌తి బాలీవుడ్ రీమేక్ పేరుతో మూడేళ్ల త‌న ప్రైమ్ టైమ్ ను వృధా చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్ గా భైర‌వం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్న అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఛ‌త్ర‌ప‌తి రీమేక్ త‌ర్వాత వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టిన శ్రీనివాస్ ప్ర‌స్తుతం త‌న మూవీ కిష్కింధ‌పురి ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు.

కిష్కింధ‌పురి ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా తెర‌కెక్కిన కిష్కింధ‌పురి సినిమా సెప్టెంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కౌశిక్ పెగిళ్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ హార్రర్ థ్రిల్ల‌ర్ పై మంచి అంచాలున్నాయి. ఆల్రెడీ రిలీజైన టీజ‌ర్, ట్రైల‌ర్ల‌కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ట్రైల‌ర్ రిలీజ‌య్యాక అంద‌రికీ ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు పెరిగాయి.

డిఫ‌రెంట్ గా ప్ర‌మోష‌న్లు

హార్రర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ అంద‌రినీ భ‌య‌పెట్టేలా ఉండ‌టంతో ఆడియ‌న్స్ ఈ సినిమాపై ప్ర‌త్యేక ఆస‌క్తిని ఏర్ప‌ర‌చుకున్నారు. అయితే చిత్ర యూనిట్ సినిమాను మాత్ర‌మే కాకుండా ప్ర‌మోష‌న్స్ ను కూడా చాలా డిఫ‌రెంట్ గా ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా జ‌రిగే ఇంట‌ర్వ్యూల‌ను కూడా ఓ స్పెష‌ల్ సెట్ లో చేస్తున్నారు.

75 రోజుల పాటూ హార్ర‌ర్ సెట్‌లోనే

అయితే కిష్కింధ‌పురి చేస్తున్న‌ప్పుడు ఏమైనా నెగిటివ్ వైబ్రేష‌న్స్ ఫేస్ చేశారా అనే ప్ర‌శ్న హీరో శ్రీనివాస్ కు ఎదుర‌వ‌గా, అత‌ను న‌వ్వి చాలా సార్లు అలా అనిపించింద‌ని, నైట్ టైమ్ షూట్ చేయ‌డం పైగా మార్చురీల్లో ఎక్కువ సేపు ఉండ‌టం, 75 రోజుల పాటూ హార్ర‌ర్ సెట్ లోనే షూటింగ్ జ‌రిగింద‌ని, ఇలాంటి సెట్ లో ఉన్న‌ప్పుడు మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న ఎన‌ర్జీస్ డౌన్ అవుతాయ‌ని, అయినా యాక్ట‌ర్ లైఫ్ లో ఇవ‌న్నీ భాగ‌మే అనుకున్నాన‌ని, తెర‌పై మా హార్డ్ వ‌ర్క్ అంద‌రికీ క‌నిపిస్తుంద‌ని, ఆడియ‌న్స్ కు మా వ‌ర్క్ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని శ్రీనివాస్ చెప్పారు.