టైసన్ నాయుడు రిలీజ్ పై శ్రీనివాస్ ఏమన్నారంటే
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం కెరీర్లో సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 4 Sept 2025 1:00 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం కెరీర్లో సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు సూపర్ హిట్ సినిమా ఛత్రపతిని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి తన ప్రైమ్ టైమ్ మూడేళ్లను వృధా చేసుకున్న శ్రీనివాస్ ఆ సినిమాతో దారుణమైన డిజాస్టర్ ను అందుకున్నారు. ఛత్రపతి రీమేక్ ఫెయిలవడంతో తిరిగి టాలీవుడ్ వచ్చేశారు శ్రీనివాస్.
రెండేళ్ల కిందటే మొదలైన టైసన్ నాయుడు
తిరిగి టాలీవుడ్ కు వచ్చిన శ్రీనివాస్, భీమ్లానాయక్ ఫేమ్ సాగర్. కె చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమాను అనౌన్స్ చేశారు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న టైసన్ నాయుడు సినిమా రెండేళ్ల కిందటే సెట్స్ పైకి వెళ్లింది. కానీ ఇప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. వివిధ కారణాల వల్ల టైసన్ నాయుడు వాయిదా పడుతూ వస్తుంది. శ్రీనివాస్ ఆ సినిమా తర్వాత మొదలుపెట్టిన సినిమాలు కూడా షూటింగ్ పూర్తై రిలీజయ్యాయి.
కానీ టైసన్ నాయుడు రిలీజ్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా కిష్కింధపురి ప్రమోషన్స్ లో భాగంగా మీడియ ముందుకొచ్చిన శ్రీనివాస్‌కు టైసన్ నాయుడు రిలీజ్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. టైసన్ నాయుడు సినిమా తర్వాత మొదలైన మూవీస్ కూడా రిలీజవుతున్నాయి కానీ దాని పరిస్థితేంటని అడిగారు.
డిసెంబర్ లో టైసన్ నాయుడు
ఆ ప్రశ్నకు శ్రీనివాస్ స్పందించి సమాధానమిచ్చారు. టైసన్ నాయుడు షూటింగ్ పూర్తైందని, సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు కానీ రిలీజ్ ఎందుకింత డిలే అయిందనే విషయాన్ని మాత్రం దాటేశారు. ప్రగ్యా జైస్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న టైసన్ నాయుడు చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
