Begin typing your search above and press return to search.

రీమేక్ సినిమా.. షాక్ తగిలాక మేల్కొన్నాడు..!

టాలీవుడ్ యువ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   9 Sept 2025 1:53 PM IST
రీమేక్ సినిమా.. షాక్ తగిలాక మేల్కొన్నాడు..!
X

టాలీవుడ్ యువ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. యాక్షన్ సినిమాలతో తన స్ట్రెంగ్త్ చూపించిన బెల్లంకొండ శ్రీనివాస్ బీ టౌన్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఐతే ఆ క్రేజే అతన్ని ఛత్రపతి రీమేక్ చేసేలా చేసింది. కానీ ఆ సినిమా పై పెట్టుకున్న బెల్లంకొండ ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా అయ్యింది.

మనోజ్, నారా రోహిత్ కూడా..

ఇక ఆ తర్వాత భైరవం అంటూ మరో రీమేక్ సినిమా చేశాడు బెల్లంకొండ హీరో. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ్ సినిమా గరుడన్ కి రీమేక్ గా తీశారు. సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటించారు. రిలీజ్ ముందు నానా హంగామా చేసిన భైరవం రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. ఐతే ఈ సినిమా చేసి రిజల్ట్ చూసిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇక రీమేక్ జోలికి వెళ్లకూడదు అనే తత్వం బదోపడింది.

లేటెస్ట్ గా అతను చేసిన కిష్కిందపురి సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో గరుడన్ సినిమా రీమేక్ గా భైరవం పై చాలా ఎక్స్ పెక్టెషన్స్ పెట్టుకున్నాం కానీ ఆ సినిమా రిజల్ట్ షాక్ ఇచ్చింది. గరుడన్ ని ఎక్కువమంది చూసి ఉండరన్న ఉద్దేశ్యంతో దాన్ని రీమేక్ చేశాం ఇక మీదట రీమేక్ ల జోలికి వెళ్లనని అంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. రీమేక్ సినిమా అంటే తనకే చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటిది ఆడియన్స్ కు ఎలా ఉంటుందని ఆలోచించలేకపోయానని అన్నాడు.

మొదటి సినిమా నుంచి తన బెస్ట్..

అందుకే ఇక ఒరిజినల్ కథలతోనే రావాలని డిసైడ్ అయినట్టు చెప్పారు బెల్లంకొండ శ్రీనివాస్. ఐతే భైరవం సినిమా కెరీర్లో ఫస్ట్ టైం ఒక రూరల్ డ్రామా సినిమాగా చేశా. ఆ ఎక్స్ పీరియన్స్ బాగా అనిపించిందని అన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం కౌశిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన కిష్కిందపురి సినిమా తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బెల్లంకొండ హీరో. ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా నుంచి తన బెస్ట్ ప్రూవ్ చేసుకోవాలని తాపత్రయ పడుతూనే ఉన్నాడు. ఐతే మొదటి నుంచి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్ కు దగ్గరైన అతను రాక్షసుడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఐతే ఆ తర్వాత మళ్లీ వరుస ఫెయిల్యూర్స్ అతన్ని కెరీర్ లో వెనక్కి నెట్టేశాయి. భైరవం కూడా నిరాశపరచగా కిష్కిందపురితో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.