Begin typing your search above and press return to search.

'శ్రీనివాస కావ్యనం' గ్లింప్స్.. శ్రీనివాస్, కావ్య దృష్టిలో ప్రేమంటే ఏంటి?

ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రేమ అనేది ఎవ్రీథింగ్ అని పేర్కొన్నారు. ప్రేమ మనసుకు ఓ ఇల్లు లాంటిదని భావిస్తున్నానని చెప్పారు.

By:  M Prashanth   |   9 April 2026 10:00 PM IST
శ్రీనివాస కావ్యనం గ్లింప్స్.. శ్రీనివాస్, కావ్య దృష్టిలో ప్రేమంటే ఏంటి?
X

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వ్యక్తిగత జీవితంలో కొత్త ఛాప్టర్ త్వరలో ప్రారంభం కానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాచిలర్ లైఫ్‌ కు గుడ్‌ బై చెప్పబోతున్న ఆయన.. కావ్య రెడ్డి అనే యువతిని వివాహం చేసుకోనున్నారు. ఆ జంట నిశ్చితార్థ వేడుక ఇటీవల హైదరాబాద్‌ లో గ్రాండ్ గా జరగ్గా.. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే వీరి ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన ఎంగేజ్మెంట్‌ తో ఆ వార్తలకు అధికారిక ముద్ర పడినట్లే. ముందు రోకా కార్యక్రమంలో తన కాబోయే జీవిత భాగస్వామిని పరిచయం చేసిన సాయి శ్రీనివాస్.. ఏప్రిల్ 5న నగరంలోని ఓ లగ్జరీ రిసార్ట్‌ లో నిశ్చితార్థాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

శ్రీనివాస కావ్యనం అనే ప్రత్యేక థీమ్‌ తో నిర్వహించిన ఆ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఆ కార్యక్రమం ఎంతో కూల్ గా సాగింది. సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి ఇద్దరూ మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ లో మెరిసిపోయారు. స్పెషల్ స్టేజ్ డెకరేషన్, ఆహ్లాదకరమైన వాతావరణం, కుటుంబ సభ్యుల ఆనందం వేడుకకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

నిశ్చితార్థ వేడుకలో తీసిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన ఎంగేజ్మెంట్ గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఆ జంట మధ్య కనిపించిన అందమైన క్షణాలు నెటిజన్లను ఆకర్షించాయి. బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రత్యేకంగా ఉండటంతో గ్లింప్స్‌ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రేమ అనేది ఎవ్రీథింగ్ అని పేర్కొన్నారు. ప్రేమ మనసుకు ఓ ఇల్లు లాంటిదని భావిస్తున్నానని చెప్పారు. కావ్య రెడ్డి కూడా ప్రేమను ఓ ఇంటితో పోల్చుతూ తన భావాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ గ్లింప్స్ చూసిన అభిమానులు, సినీ ప్రియులు చాలా క్యూట్‌ గా ఉందని, అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక వివాహానికి సంబంధించిన వివరాలపై కూడా ఆసక్తి నెలకొంది. నిశ్చితార్థాన్ని గ్రాండ్ గా నిర్వహించినప్పటికీ, పెళ్లి మాత్రం నార్మల్ గా జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు సమాచారం. ఏప్రిల్ 29న తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆ జంట వివాహ బంధంలో అడుగు పెట్టనుంది. అనంతరం హైదరాబాద్‌ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అదే సమయంలో కావ్య రెడ్డి చెల్లెలు, సాయి శ్రీనివాస్ ఒకే కాలేజీలో చదివిన నేపథ్యంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు దారి తీసిందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఆ జంట నిశ్చితార్థ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్వరలో జరగనున్న వివాహం కూడా ఇదే తరహాలో అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.