Begin typing your search above and press return to search.

ఈ హిందీ 'చత్రపతి' మహా తెలివైనోడు..!

ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'చత్రపతి' సినిమాను హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

By:  Ramesh Palla   |   30 Aug 2025 11:50 AM IST
ఈ హిందీ చత్రపతి మహా తెలివైనోడు..!
X

ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'చత్రపతి' సినిమాను హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. హిందీ చత్రపతి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయినా కూడా అక్కడ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి గుర్తింపు లభించింది. ఎంతో మంది తెలుగు హీరోలు ఉన్నారు. అందులో అతి కొద్ది మంది మాత్రమే హిందీ ప్రేక్షకులకు సుపరిచితం. అందులో బెల్లంకొండ బాబు కూడా ఒకడు కావడం విశేషం. ఆయన హీరోగా నటించిన తెలుగు సినిమాలు సైతం హిందీలో డబ్‌ అయ్యి మంచి పేరును తెచ్చి పెట్టాయి. తెలుగులో బెల్లంకొండ అదృష్టం కొద్ది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. సాధారణంగా హీరోలు ఒకటి రెండు ఫ్లాప్స్ పడితేనే కనుమరుగు అవుతారు. కానీ బెల్లంకొండ హీరో మామూలు అదృష్టవంతుడు కాదు అని ఆయన సినిమాల లైనప్ చూస్తూ అర్థం అవుతుంది.

భైరవంతో వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

ఈ మధ్య కాలంలో ఈ బెల్లంకొండ హీరో నటించిన భైరవం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. హిట్‌ పడ్డా పడకున్నా బెల్లంకొండకు మంచి పేరు మాత్రం ఎప్పుడూ వస్తుంది. దాంతో సినిమా ఆఫర్లు క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. ఆయన కాస్త స్లో అవ్వాల్సిందే కానీ వరుసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి వివిధ దశల్లో ఉన్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌లోనే కాకుండా ఈయనకు ఇతర భాషల్లోనూ, ఓటీటీ మార్కెట్‌ బాగా రీచ్‌ ఉన్న కారణంగా భారీ పారితోషికంను ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు మంచి పారితోషికంను అందుకుంటూ టైర్ 2 హీరోల సరసన నిలిచాడు అనడంలో సందేహం లేదు.

దుబాయ్ లో అపార్ట్‌మెంట్‌ కొనుగోలు

ఇప్పటికీ చాలా మంది యంగ్‌ హీరోలు కోటి, రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ ఉంటే ఈ కుర్ర హీరో మాత్రం దాదాపుగా రూ.8 నుంచి రూ.10 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డబ్బు బాగానే వెనక వేశాడు అని ఆయన సన్నిహితులు అంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో బెల్లంకొండ దుబాయ్‌ లో అత్యంత ఖరీదైన ఏరియాలో అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశాడని, అది రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిలో భాగం అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ముఖ్యంగా పెద్ద హీరోలు ఇలా దుబాయ్‌, ఇతర అరబ్‌ దేశాల్లో రియల్‌ ఎస్టేట్‌ లో పెట్టుబడి పెడుతున్నారు.

బెల్లంకొండ సురేష్‌ నిర్మాణంలో..

చాలా తెలివిగా బెల్లకొండ అప్పుడే దుబాయ్‌ వంటి అభివృద్దిలో దూసుకు పోతున్న దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఖచ్చితంగా ఆయన ముందు ముందు మరింతగా వ్యాపారం చేస్తాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హీరోగా వచ్చిన డబ్బును ఎక్కువగా వృదా చేయకుండా తెలివిగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను చాలా మంది అభినందిస్తున్నారు. తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా బాగానే సంపాదించినా, అదే సినిమా రంగంలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. చాలా పెద్ద మొత్తంలో ఉన్న అప్పులను సాయి శ్రీనివాస్ తీర్చాడని కూడా అంటారు. మొత్తానికి తండ్రి అప్పులను తీర్చడంతో పాటు, ఆస్తులను కొనడం అనేది ఖచ్చితంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తెలివి అనొచ్చు. ఇలా మంచి మార్గంలో వెళ్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఎందుకు హిందీలో చత్రపతి సినిమా చేయాలనే తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బెల్లంకొండ ఫ్యూచర్‌ ఎలా ఉంటుందో ప్రస్తుత సినిమాల ఫలితాల తర్వాత తేలిపోతుందేమో చూడాలి.