Begin typing your search above and press return to search.

కిష్కింధపురి: బెల్లంకొండ ఫైనల్ గా ఏమన్నారంటే..

టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న కిష్కింధపురిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   10 Sept 2025 10:42 PM IST
కిష్కింధపురి: బెల్లంకొండ ఫైనల్ గా ఏమన్నారంటే..
X

టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న కిష్కింధపురిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించారు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల ముందు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా విశేషాలను పంచుకున్నారు.

హారర్ జానర్‌లో ఫస్ట్ అనుభవం

బెల్లంకొండ మాట్లాడుతూ..“నేను ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాల్లోనే కనిపించాను. కానీ నాకు పర్సనల్‌గా డిఫరెంట్ జానర్స్ అంటే ఇష్టం. డైరెక్టర్ కౌశిక్ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఈ జానర్‌లో నేను ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకున్నాను. కిష్కింధపురి ఆ కోరికను తీర్చింది. ఫస్ట్ టైమ్ థియేటర్స్‌లో చూసినప్పుడు సినిమా అదిరిపోయింది. ముఖ్యంగా రాధాకృష్ణ గారి సౌండ్ డిజైన్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఇది థ్రిల్‌తో పాటు కొత్త అనుభవం ఇస్తుంది” అన్నారు.

టెక్నికల్ స్ట్రెంత్, ప్రొడక్షన్ సపోర్ట్

సౌండ్, విజువల్స్, ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్రత్యేకతని తెచ్చినట్లు హీరో పేర్కొన్నారు. “సౌండ్ డిజైన్‌లో, గ్రాఫిక్స్‌లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత సాహు గారపాటి సినిమాను నిర్మించారు. హారర్ మిస్టరీ జానర్‌లో ఇంత టెక్నికల్ స్ట్రాంగ్‌గా సినిమాను తీయడం ప్రౌడ్‌గా అనిపిస్తోంది. ఆడియన్స్‌ని కొత్త రకం అనుభూతితో కదిలించగల సినిమా ఇది” అన్నారు.

యాక్షన్, హారర్ మిక్స్

ఈ సినిమా యాక్షన్ గురించి చెబుతూ.. “యాక్షన్ కూడా కథలో భాగంగానే ఉంటుంది. ఆర్గానిక్‌గా, నేచురల్‌గా రూపొందించాం. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ కలిపి ఆడియన్స్‌కి థియేటర్లో సీట్ ఎడ్జ్ అనుభవం ఇస్తాయి. హారర్ సినిమాల్లో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడూ చూడలేదు. ఇది పూర్తిగా కొత్త బ్లెండ్” అని చెప్పారు.

అనుపమ, వింటేజ్ సెట్ ప్రత్యేకతలు

అనుపమ నటన గురించి మాట్లాడుతూ.. “ఆమె పాత్ర చాలా టఫ్. కానీ అద్భుతంగా చేసింది. కొత్తగా కనిపిస్తుంది. అలాగే సినిమాలో వింటేజ్ రేడియో సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రియల్ వాంటెడ్ హౌస్‌లో షూట్ చేయడం జరిగింది. అది నిజంగా పాతబడిపోయిన భవనం. తర్వాత వాళ్లకు కొత్త బిల్డింగ్ కట్టిపెట్టాం” అన్నారు.

రాబోయే ప్రాజెక్టులు

తన తదుపరి సినిమాల గురించి చెబుతూ “టైసన్ నాయుడు షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. హైందవ చివరి దశలో ఉంది. సమ్మె కారణంగా బ్రేక్ పడింది కానీ త్వరలో పూర్తవుతుంది. అలాగే పొలిమేర డైరెక్టర్ అనిల్‌తో ఒక న్యూ ఏజ్ థ్రిల్లర్ చేయబోతున్నాను” అని వెల్లడించారు. మొత్తానికి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్ధమవుతుంది. కిష్కింధపురి సాధారణ హారర్ సినిమాగా కాకుండా, మిస్టరీతో కూడిన వినూత్నమైన థ్రిల్లర్ అని క్లారిటీ ఇచ్చారు. మరి సినిమా ఏలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.