కిష్కింధపురి.. ప్రతి ఒక్కరికీ లాభమే..
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్ గా కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 17 Sept 2025 2:44 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్ గా కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమాతో ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన ఆ మూవీలో యువ నటి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు.
చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, శాండీ మాస్టర్, మర్కంద్ దేశ్ పాండే, హినా భాటియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై ప్రముఖ ప్రొడ్యూసర్ సాహు గారపాటి.. రూ.32 బడ్జెట్ తో రూపొందించారు.
అయితే సినిమాకు రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బెల్లంకొండ శ్రీనివాస్- అనుపమ పరమేశ్వరన్ యాక్షన్, కౌశిక్ పెగళ్లపాటి స్టోరీ టెల్లింగ్, సాహు గారపాటి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు అద్భుతమైన విజువల్స్ ఆడియన్స్ ను ఫిదా చేస్తున్నాయి.
స్పీడ్ గా షూటింగ్ చేసినా.. ఎక్కడ క్వాలిటీ మిస్ చేయలేదని నెటిజన్లు చెబుతున్నారు. కేవలం 70 రోజుల్లో షూటింగ్ ను ముగించగలగడం గ్రేట్ అని అంటున్నారు. ఏదేమైనా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే కిష్కింధపురి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది.
కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ గా దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకున్న కిష్కింధపురి.. లాభాల బాటలో పయనిస్తోంది. అయితే సినిమా బడ్జెట్ లో గణనీయమైన భాగాన్ని, దాదాపు 80 శాతాన్ని శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులతో మేకర్స్ సొంతం చేసుకున్నారు.
నాన్ థియేట్రికల్ ఒప్పందాల ద్వారా కూడా వసూలు చేశారు. శ్రీనివాస్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండడం కిష్కింధపురి మేకర్స్ కు కలిసొచ్చింది. ఇక రూ.8 కోట్ల అడ్వాన్స్ తో సినిమా థియేటర్స్ లో విడుదల చేశారు. ఇప్పుడు మొత్తం రికవరీ అవ్వడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్చిబిటర్లు ప్రాఫిట్ జోన్ లో ఉన్నారు.
అదే సమయంలో చివరగా రాక్షసుడు తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు మంచి హిట్ అందుకున్నారు. భగవంత్ కేసరి తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నిర్మాత సాహు గారపాటికి కూడా ఊరట లభించింది. అనుపమకు మంచి హిట్ దక్కింది. మొత్తానికి కిష్కింధపురి మూవీతో అందరికీ అన్ని విధాలుగా లాభమే.
