మొదటి హిట్‌ను జీవితాంతం గుర్తించుకుంటా
ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఎట్టకేలకు ఓ సక్సెస్ దక్కింది.
By: Sravani Lakshmi Srungarapu | 13 Sept 2025 2:48 PM ISTఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఎట్టకేలకు ఓ సక్సెస్ దక్కింది. తాజాగా కిష్కింధపురి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీనివాస్ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కౌశిక పెగిళ్లపాటి దర్శకత్వం వహించారు.
ఆడియన్స్ ప్రేమను నిజాయితీగా దక్కించుకున్నా
హార్రర్ కామెడీ జానర్ లోనే విభిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాతో మేకర్స్ ఆడియన్స్ కు కొత్త అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నించి అందులో సక్సెస్ అయ్యారు. కిష్కింధపురికి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ ను ఏర్పాటు చేయగా, అందులో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా సక్సెస్ అయినందుకు, నిజాయితీగా ఆడియన్స్ ప్రేమను సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
మూడు షోలు అనుకుంటే 66 షోలు
సినిమా రిలీజ్ కు ముందు కిష్కింధపురికి మూడు ప్రీమియర్ షో లు వేద్దామనుకుంటే అవి ఏకంగా 66 షోలు అయ్యాయని, ఈ సినిమా ఆడియన్స్ కు బాగా చేరువైందని, కొన్ని వందల మంది మధ్య కూర్చుని తాను ఈ సినిమాను చూశానని, సినిమాను థియేటర్లలో చూసిన ప్రతీ ఒక్కరూ కిష్కింధపురి గురించి బాగా చెప్తున్నారని శ్రీనివాస్ అన్నారు.
ఆడియన్స్ ను మెప్పించే సినిమా
తమ సినిమా క్రిటిక్స్ ను మెప్పించే సినిమా కాకపోయినా, ఆడియన్స్ కు మాత్రం మంచి సంతృప్తినిస్తుందని, పవర్ స్టార్ నటించిన ఓజి సినిమా రిలీజయ్యేవరకు తమ సినిమా థియేటర్లలో రన్ అవుతూనే ఉంటుందన్నారు శ్రీనివాస్. అదే ఈవెంట్ లో కెరీర్లో మొదటిసారి హిట్ కొట్టిన సిట్యుయేషన్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని, ఈ మూమెంట్స్ ను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని డైరెక్టర్ కౌశిక్ చెప్పగా, తాము ఊహించిన దాని కంటే ఈ సినిమాకు డబుల్ రెస్పాన్స్ వస్తుందని నిర్మాత సాహు చెప్పారు.
