నేను లాంచ్ అవాలనుకున్న డైరెక్టర్ తో గణేష్ మూవీ
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న బెల్లంకొండ సురేష్ కు ఇద్దరు కొడుకులున్నారనే విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 9 Sept 2025 12:00 PM ISTఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న బెల్లంకొండ సురేష్ కు ఇద్దరు కొడుకులున్నారనే విషయం తెలిసిందే. వారే సాయి శ్రీనివాస్, గణేష్ బాబు. అయితే ఇప్పటికే సురేష్ పెద్ద కొడుకు సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెట్టి తీరిక లేకుండా ఉన్నారు.
సెప్టెంబర్ 12న రానున్న కిష్కింధపురి
అయితే శ్రీనివాస్ కు అవకాశాలైతే వస్తున్నాయి కానీ అల్లుడు శ్రీను తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. తనకున్న ఇమేజ్ తో మంచి ఛాన్సులను అందుకున్నారు శ్రీనివాస్. ప్రస్తుతం శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి అనే హార్రర్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. సెప్టెంబర్ 12న కిష్కింధపురి ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్వాతిముత్యంతో హీరోగా గణేష్ ఎంట్రీ
ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీనివాస్ చాలా బిజీగా ఉన్నారు. కిష్కింధపురి ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్న శ్రీనివాస్, తన తమ్ముడు బెల్లంకొండ గణేష్ నెక్ట్స్ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడారు. బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ స్వాతిముత్యం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి మార్కులు అందుకున్న విషయం తెలిసిందే.
మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న గణేష్, తర్వాత నేను స్టూడెంట్ సర్ అనే సినిమాను చేశారు. అయితే గణేష్ తన అన్న శ్రీనివాస్ లాగా సినిమాల విషయంలో దూకుడు చూపించడం లేదు. సినిమా సినిమాకీ ఎంతో గ్యాప్ తీసుకుంటున్న గణేష్ నెక్ట్స్ ప్రాజెక్టు గురించి శ్రీనివాస్ కిష్కింధపురి ప్రమోషన్స్ లో వెల్లడించారు.
కరుణాకరన్‌తో గణేష్ నెక్ట్స్ మూవీ
గణేష్ నెక్ట్స్ మూవీ చాలా చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్టు అని, నాలుగు రోజుల ముందే సినిమా ఓకే అయిందని, ఆ సినిమాకు కరుణాకరన్ డైరెక్టర్ అని, తాను లాంచ్ అవాలనుకున్న కరుణాకరన్ డైరెక్షన్ లో తన తమ్ముడు సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ సినిమా నిర్మాతలకు ఫస్ట్ ప్రాజెక్టు అని, సినిమాలపై వారికెంతో ప్యాషన్ ఉందని, ఫ్యూచర్ లో వాళ్లు మరిన్ని సినిమాలు చేస్తారని, ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించనున్నాడని, టైసన్ నాయుడు సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియోనే మ్యూజిక్ అందిస్తున్నాడని, త్వరలోనే గణేష్ ప్రాజెక్టు నుంచి అనౌన్స్‌మెంట్ రానుందని శ్రీనివాస్ చెప్పారు. -
