Begin typing your search above and press return to search.

కిష్కింధపురి టీజర్ డేట్ లాక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!

ప్రముఖ టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు

By:  Madhu Reddy   |   15 Aug 2025 1:00 AM IST
కిష్కింధపురి టీజర్ డేట్ లాక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
X

ప్రముఖ టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన.. చివరిగా భైరవం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ తోపాటు నారా రోహిత్ హీరోలుగా నటించారు.ఇప్పుడు కిష్కింధపురి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ టీజర్ రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అనౌన్స్మెంట్ విషయాన్ని చెప్పుకొచ్చారు. పోస్టర్ విషయానికి వస్తే.. పౌర్ణమి వెలుగుల్లో నీటిలో ప్రతిబింబాలుగా అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను చూపించారు.

సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 12వ తేదీన చాలా గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, పాటలు, గ్లింప్స్ ప్రేక్షకులలో అంచనాలను రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తోంది అని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15 రాబోతున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

ఒక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయానికి వస్తే.. సినిమా నటుడిగా కెరియర్ మొదలు పెట్టిన 2014లో వచ్చిన అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఈ సినిమా తర్వాత స్పీడున్నోడు , జయ జానకి నాయక , సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు ఇలా పలు చిత్రాలలో నటించిన ఈయన.. ఇప్పుడు కిష్కింధపురి సినిమాతో పాటూ పలు చిత్రాలను లైన్ లో పెట్టినట్లు సమాచారం.

ఇక అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే.. అ ఆ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో పరదా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం వినూత్న ప్రమోషన్స్ కూడా చేపట్టింది అనుపమ. అందులో భాగంగానే వైజాగ్ రోడ్డు ఎక్కి మైకు పెట్టి పరదాలమ్మ పరదాలు అంటూ సరదాగా అక్కడి జనాలను ఆకట్టుకుంది. మరి ఇప్పుడు కిష్కింధపురి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుపమ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.