Begin typing your search above and press return to search.

బెల్లంకొండ 'కిష్కింధపురి'.. ట్రైలర్ భయపెట్టిందా లేదా?

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   3 Sept 2025 11:50 AM IST
బెల్లంకొండ కిష్కింధపురి.. ట్రైలర్ భయపెట్టిందా లేదా?
X

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హారర్‌ - మిస్టరీ కథతో రూపొందుతున్న ఆ సినిమాకు చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.


యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా.. సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సహా అన్నీ అప్డేట్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై పాజిటవ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ మరో ట్రీట్ ఇచ్చారు. థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

నిశ్శబ్దం భయానకంగా, ధ్వని భయానకంగా ఉండే భయంకరమైన ప్రపంచానికి స్వాగతమంటూ మేకర్స్ రాసుకొచ్చారు. అయితే ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన.. అంటూ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ చేయింది. కిష్కింధపురి అనే భయానక పట్టణంలో సువర్ణ మాయ అనే భయంకరమైన ఇంటి చుట్టూ కథ తిరుగుతుంది. హీరోహీరోయిన్ల బృందం ఆ ఇంట్లోకి వెళ్తుంది.

అందులో ఏముందో తెలుసుకోవాలనుకుంటుంది అప్పుడే వారంతో ఒక పీడకల వ్యూహంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. తమలోని దుష్టశక్తుల నుంచి తప్పించుకోవడానికి చేసే పోరాటాన్ని అనుసరిస్తారు. చివరకు ఏం జరిగిందనేది సినిమాగా తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రైలర్ ఫుల్ వైరల్ గా మారింది. సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

అయితే దర్శకుడు కౌశిక్ తెలుగు సినిమాలో అరుదుగా కనిపించే ఒక శైలిని అన్వేషించడం ద్వారా సాహసోపేతమైన అడుగు వేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన, ఉల్లాసకరమైన కథనంతో భయానక ప్రపంచాన్ని రూపొందించారు. కలవరపెట్టే నేపథ్యం, వెంటాడే సన్నివేశాలు భయపెడుతున్నాయి. అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందిస్తున్నాయి.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పూర్తి నటనా నైపుణ్యాన్ని చూపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు ఎఫెక్టివ్ డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కచ్చితంగా కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ తన యాక్టింగ్ తో అదరగొట్టేలా ఉన్నారు. ట్రైలర్ చివర్లో గూస్ బంప్స్ తెప్పించారు.

నెల్లూరు సుదర్శన్, హైపర్ ఆది సహా పలువురు కామెడీ పండిస్తూ ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రాఫర్ చిన్మయ్ సలస్కర్ తన వర్క్ తో మెప్పించారు. చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ డి. శివ కామేష్, ప్రొడక్షన్ డిజైనర్ మనీషా ఎ. దత్ సహకారం బాగుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ.. కిష్కింధపురిపై ఉన్న బజ్‌ ను ఫుల్ గా పెంచింది.