Begin typing your search above and press return to search.

టాప్ టెక్నీషియ‌న్లు హీరోగానూ స‌క్సెస్ అయ్యేనా?

టెక్నీషియ‌న్లు మ్యాక‌ప్ వేసుకుని న‌టులుగా తెరంగేట్రం చేయ‌డం కొత్తేం కాదు. చాలా కాలంగా కొన‌సాగుతున్న‌దే. తాజాగా మ‌రికొంత మంది టెక్నీషియ‌న్లు హీరోల‌గా ఎంట్రీ ఇస్తున్నారు.

By:  Srikanth Kontham   |   25 Jan 2026 8:00 AM IST
టాప్ టెక్నీషియ‌న్లు హీరోగానూ స‌క్సెస్ అయ్యేనా?
X

టెక్నీషియ‌న్లు మ్యాక‌ప్ వేసుకుని న‌టులుగా తెరంగేట్రం చేయ‌డం కొత్తేం కాదు. చాలా కాలంగా కొన‌సాగుతున్న‌దే. తాజాగా మ‌రికొంత మంది టెక్నీషియ‌న్లు హీరోల‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే సంగీత ప్ర‌పంచంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నరాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ `ఎల్ల‌మ్మ‌`తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎప్ప‌టి నుంచో మ‌న‌సులో న‌టించాలి అనే కోరిక ఉన్నా ఇంత కాలం పెద‌వి దాటి రాలేదు. `ఎల్ల‌మ్మ‌`కు హీరో సెట్ అవ్వ‌క‌పోవ‌డంతో? అందుకోసం తానే హీరోగా మారుతున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ హీరో కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నాడు.

ఇందులో డ‌ప్పు క‌ళాకారుడిగా క‌నిపించ‌నున్నాడు. అలాగే పాన్ ఇండియా డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా న‌టుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. `డీసీ` సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. సినిమాలో ఆయ‌న‌కు జోడీగా వామిగా గ‌బ్బి న‌టిస్తోంది. అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర‌మిది. ఈ సినిమా త‌ర్వాత లోకేష్ న‌టుడిగా కొన సాగుతుడా? లేదా? అన్న‌ది చూడాలి. అలాగే మాలీవుడ్ డైరెక్ట‌ర్ అభిష‌న్ జీవింత్ `విత్ ల‌వ్` తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. ఇందులో అన‌స్వ‌ర రాజ‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌ద‌న్ ధ‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు.

వ‌చ్చే నెల‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే టాలీవుడ్ కోరియోగ్రాఫ‌ర్ య‌ష్ ని హీరోగా ప‌రిచయం చేసే బాద్య‌త స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు తీసుకున్నారు. య‌శ్ హీరోగా `ఆకాశం దాటి వ‌స్తావా` అనే చిత్రాన్ని రాజుగారు ప్రారంభించి చాలా కాల‌మ‌వుతోంది. శ‌శి కుమార్ ని డైరెక్ట‌ర్ గా ఎంచుకున్నారు. కానీ ఈ సినిమా ఏ ద‌శ‌లో ఉందో? తెలియ‌దు. ప్ర‌క‌టించి చాలా కాల‌మ‌వుతుంది. రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లైంది. కానీ షూటింగ్ పూర్త‌యిందా? అస‌లు ఈ సినిమా ఉందా? ర‌ద్ద‌యిందా? అన్న‌ది కూడా క్లారిటీ లేదు.

అలాగే ఫైట్ మాస్ట‌ర్ ఫీట‌ర్ హెయిన్స్ హీరోగా ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కానీ ఆ సినిమా ప్రారంభ‌మైందా? లేదా? అన్న‌ది తెలియ‌దు. ఈ చిత్రానికి వెట్రీ మార‌న్ డైరెక్ట‌ర్ గా ఫిక్స్ అయ్యారు. ప్ర‌భుదేవా కూడా తొలుత‌ కొరియోగ్రాఫ‌ర్ గానే ప‌ని చేసాడు. ఆ త‌ర్వాతే న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా తెరంగేట్రం చేసి స‌క్సెస్ అయ్యాడు. రాఘ‌వ లారెన్స్ కూడా కొరియోగ్రాఫ‌ర్ గానే ఎంట్రీ ఇచ్చి ద‌ర్శ‌కుడిగా, హీరోగా స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే.