బ్యూటీ మూవీ.. మరో పని కంప్లీట్..
సెప్టెంబర్ 19వ తేదీన బ్యూటీ సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
By: M Prashanth | 16 Sept 2025 7:30 PM ISTఆయ్ ఫేమ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య ఇప్పుడు లీడ్ రోల్ లో బ్యూటీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాలో నీలఖి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేమ, కుటుంబ విలువలు, తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో రెడీ అవుతున్న ఆ చిత్రం.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది.
గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్ వెబ్ సిరీస్ లతో పాటు భలే ఉన్నాడే సినిమా ఫేమ్ జెఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను వానరా సెల్యూలాయిడ్, మారుతి టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
సెప్టెంబర్ 19వ తేదీన బ్యూటీ సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ సూపర్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ చేశాయి. ఇప్పుడు విడుదలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు మేకర్స్.
అందులో భాగంగా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేశారు. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి బ్యూటీ మూవీకి గాను యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్నారు. ఆ విషయాన్ని ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో బ్యాక్ గ్రౌండ్ కూల్ గా ఉండగా.. హీరో హీరోయిన్లలిద్దరూ సీరియస్ లుక్ లో ఉన్నారు.
కాగా.. సినిమాలో అంకిత్, నీలఖితోపాటు నరేష్, వాసుకి, సత్య కృష్ణన్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ బ్యూటీ మూవీకి మ్యూజిక్ అందించిన విజయ్ బుల్గానిన్.. ఇప్పుడు బ్యూటీకి సంగీతం అందిస్తున్నారు.
సినిమాటోగ్రఫీ బాధ్యతలు సాయి కుమార్ దారా చేపట్టారు. ఆర్ట్ డైరెక్టర్ గా బేబీ సురేష్ భీమగాని వ్యవహరించారు. అయితే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కు ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కుల ఒప్పందాలు ఖరారు అయ్యాయి. ఓటీటీ హక్కులు జీ5, శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకున్నాయి. మూవీ నిర్మాణంలో జీ స్టూడియోస్ కూడా భాగమైంది.
