అర్జున్, అలేఖ్య స్టోరీ.. 'బ్యూటీ' కొత్త గ్లింప్స్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య, సోషల్ మీడియా సెన్సేషన్ నీలఖి లీడ్ రోల్స్ లో బ్యూటీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 23 Aug 2025 2:09 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య, సోషల్ మీడియా సెన్సేషన్ నీలఖి లీడ్ రోల్స్ లో బ్యూటీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాను వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మారుతి టీం ప్రొడక్ట్ తో కలిసి అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ బ్యూటీ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఒక తండ్రి పడే ఆరాటం, ఒక తల్లి పడే ఆవేదన, అర్జున్- అలేఖ్య కథ అంటూ రిలీజ్ టీజర్ ను తీసుకొచ్చారు. విడుదల తేదీ అనౌన్స్ చేశారు.
మన పేరెంట్స్ కు మన మీద ప్రపంచాన్ని కొనిచ్చేయాలన్నంత ప్రేమ ఉంటుందంటూ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న డైలాగ్ తో గ్లింప్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత హీరోయిన్ ను చూపించారు మేకర్స్. ఐస్ క్యూబ్ టిప్ ను ఆమె యూజ్ చేస్తుండగా.. తల్లి తిడుతుంటుంది. బ్యూటీని కన్నావ్ అమ్మా అంటూ హీరోయిన్ పొగుడుకుంటుంది.
ఆ తర్వాత హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ను చూపించారు. ఇద్దరూ కలిసి స్కూటీపై చక్కర్లు కొడుతుంటారు. అదే సమయంలో గ్లింప్స్ మూడ్ ఛేంజ్ అవుతుంది. అలేఖ్య (హీరోయిన్) కనపడట్లేదని తల్లి.. తండ్రి (నరేష్)కు కాల్ చేస్తోంది. ఆ తర్వాత ఆమెను వెతకడం, కనిపెట్టడం, హీరోను పోలీస్ స్టేషన్ లో కొట్టడం వంటి సీన్స్ చూపించారు.
అయితే చివర్లో.. కూతురు అడిగిన వెంటనే కొనిచ్చినప్పుడు ఆ కిక్కు ఏంటో మధ్యతరగతి వారికే తెలుస్తుంది. దానికోసం కొంచెం కష్టపడాలి పడతా.. అంటూ నరేష్ డైలాగ్ తో గ్లింప్స్ ముగిసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ టీజర్ ఫుల్ వైరల్ గా మారింది. సినీ ప్రియులను మెప్పిస్తూ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.
ముఖ్యంగా గ్లింప్స్ లోని డైలాగ్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. హృదయాలను తాకుతున్నాయి. క్యాస్టింగ్ అంతా చాలా నేచురల్ గా నటించినట్లు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా నేచురల్ గా ఉంది. డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. విజువల్స్ అన్నీ డీసెంట్ గా సింపుల్ గా బాగున్నాయనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
దీంతో సినిమా అందరినీ మెప్పిస్తుందని అనేక మంది నెటిజన్లు అంచనా వేస్తున్నారు. రిలీజ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతుందని.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. మంచి సోల్ ఉన్న మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు. మరి సెప్టెంబర్ 19వ తేదీన రిలీజ్ కానున్న సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
