Begin typing your search above and press return to search.

'బ్యూటీ' ట్రైలర్ చూశారా? మూవీ క్లిక్ అయ్యేలా ఉందే!

సూపర్ హిట్ ఆయ్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అంకిత్ కొయ్య లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్యూటీ.

By:  M Prashanth   |   13 Sept 2025 6:56 PM IST
బ్యూటీ ట్రైలర్ చూశారా? మూవీ క్లిక్ అయ్యేలా ఉందే!
X

సూపర్ హిట్ ఆయ్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అంకిత్ కొయ్య లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్యూటీ. గీత సుబ్రహ్మణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేం జేఎస్ఎస్ వర్ధన్ వహిస్తున్న ఆ సినిమా.. రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. నీలఖి పత్ర హీరోయిన్ గా నటిస్తోంది.


వానర సెల్యూలాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌ పై అడిదాల విజయ్ పాల్ రెడ్డి, ఉమేష్ ఆర్ బన్సాల్ నిర్మిస్తున్న బ్యూటీ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ తోపాటు సాంగ్ అన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.


ఇప్పుడు సినిమా సెప్టెంబర్ 19న విడుదల కాబోతుండగా.. మేకర్స్ ట్రైలర్ ను తీసుకొచ్చారు. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తూ.. క్లిక్ అవుతుందనే హోప్స్ ను క్రియేట్ చేస్తోంది.

'ఎప్పుడన్నా నేను నిన్ను కోప్పడితే నన్ను అలా వదిలిపెట్టి వెళ్లిపోకే. నిన్ను వదిలేయడమంటే ఊపిరి వదిలేయడమే కన్నా' అంటూ హీరో హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్స్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అందమైన లవ్ ట్రాక్ ను చూపించారు. హీరోయిన్ బర్త్ డే ను ఆమె తండ్రి సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు బైక్ ఏది నాన్నా అని అడుగుతుంది.

ట్రై చేసినా కానీ కుదరలేదు అని తండ్రి చెబుతారు. అప్పుడు హీరో.. నెక్స్ట్ ఇయర్ కొంటారని నచ్చజెప్పాడు. తల్లి ఏమో.. మీ నాన్న క్యాబ్ డ్రైవర్ అమ్మా.. కలెక్టర్ కాదు అని చెబుతుంది. అప్పుడు హీరోయిన్ క్యాబ్ డ్రైవర్ అలా ఉండాలి కదా కలెక్టర్‌లా ప్రామిస్‌ లు చేయకూడదని అంటోంది. ఆ తర్వాత ట్రైలర్ సస్పెన్స్ మోడ్ లోకి వెళ్లిపోతుంది.

హీరోయిన్ మిస్ అవ్వడంతో ఆమె తండ్రి చాలా ఆవేదన చెందుతారు. అందుకు కారణంగా భావించి హీరోను పోలీసులు అరెస్ట్ చేస్తారు. లాస్ట్ లో నీవు నా లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి అన్నీ కొత్తగా జరుగుతున్నాయిని హీరోయిన్ చెబుతోంది. లిప్ లాక్ సీన్ తో ట్రైలర్ ఎండ్ అవుతోంది. ఓవరాల్ గా ట్రైలర్ అస్సలు బోర్ కొట్టకుండా క్లీన్ గా ఉందని చెప్పాలి.

కంప్లీట్ యూత్ ఫుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ యాక్టింగ్ తో ఫిదా చేసేలా ఉన్నారు. విజువల్స్ నేచరుల్ అండ్ రిచ్ గా ఉన్నాయి. డైరెక్టర్ సింపుల్ స్టోరీని బాగా రాసుకున్నట్లు కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అట్రాక్టివ్ గా ఉంది. మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న బ్యూటీ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.