Begin typing your search above and press return to search.

బ్యూటీ కోసం SKN బంపరాఫర్.. వారి కోసం ఉచితంగానే..

ఇక అసలు సర్ ప్రైజ్ ఏంటంటే, SKN స్వయంగా తన డబ్బులు పెట్టి ఒక ప్రత్యేక షోను పూర్తిగా ఉచితంగా వేయాలని నిర్ణయించుకున్నారు.

By:  M Prashanth   |   16 Sept 2025 11:02 PM IST
బ్యూటీ కోసం SKN బంపరాఫర్.. వారి కోసం ఉచితంగానే..
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్ట్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న SKN ఎప్పుడూ కూడా మంచి సినిమాల వెనుక నిలబడే వ్యక్తి. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలే కాకుండా, ఇతర సినిమాలు నచ్చినా కూడా వాటిని ప్రమోట్ చేస్తూ తన ప్రత్యేకతను చూపిస్తారు. అందుకే ఆయనకి ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ప్రస్తుతం ఈయన చూపు బ్యూటీ అనే సినిమా మీద పడింది. అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సమర్పణలో సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్, పేరెంట్స్, పిల్లల మధ్య ఉండే భావోద్వేగాలకు సంబంధించిన కథా పంథా చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో SKN తన మాటలతో సినిమాపై పాజిటివ్ హైప్ క్రియేట్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని, ప్రతి అమ్మాయి తన పేరెంట్స్‌తో కలిసి తప్పక చూడాల్సిన సినిమా ఇదని పేర్కొన్నారు.

ఇక అసలు సర్ ప్రైజ్ ఏంటంటే, SKN స్వయంగా తన డబ్బులు పెట్టి ఒక ప్రత్యేక షోను పూర్తిగా ఉచితంగా వేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మాట ప్రకారం, అమ్మాయిలు తమ పేరెంట్స్‌తో కలిసి ఈ సినిమా చూడాలి అన్న ఉద్దేశ్యంతోనే ఈ ఫ్రీ షోని ప్లాన్ చేశారు. సాధారణంగా ప్రొడ్యూసర్లు తమ సినిమాలను ప్రమోట్ చేస్తారు. కానీ SKN మాత్రం ఇతర ప్రొడ్యూసర్ సినిమా అయినా, తనకు నచ్చితే ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు. అందుకే ఆయనను కల్ట్ ప్రొడ్యూసర్ అంటారు.

సెప్టెంబర్ 18న రాత్రి 7:40 గంటలకు హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో ఈ ప్రత్యేక ఫ్రీ షో జరగనుంది. ఇందులో పాల్గొనాలనుకునే వారు +91 8639000916 నెంబర్‌కు వాట్సాప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న వారు తమ పేరెంట్స్‌తో కలిసి థియేటర్‌కు వెళ్ళి సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. ఈ సమాచారాన్ని SKN తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ప్రేక్షకులలో కూడా ఈ నిర్ణయం పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రత్యేకంగా అమ్మాయిలు, వారి కుటుంబాలు ఈ అవకాశాన్ని ఆస్వాదించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఉచితంగా సినిమాలు చూపించడం ద్వారా SKN మరోసారి తన మంచి మనసు, సపోర్ట్ నైజాన్ని నిరూపించారు. ఈ ఫ్రీ షో వల్ల సినిమా మీద క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం. మొత్తం మీద బ్యూటీ రిలీజ్‌కి ముందు SKN ఇచ్చిన ఈ బంపర్ గిఫ్ట్ సినిమా టీంకి ఒక పెద్ద బూస్ట్‌గా మారింది. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే ప్రేక్షకులు తప్పక హిట్ చేస్తారని మళ్లీ రుజువవుతోంది. ఇప్పుడు ఈ ఫ్రీ షో తర్వాత బ్యూటీపై మరింత పాజిటివ్ హైప్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో రానిస్తుందో చూడాలి.