బ్యూటీ.. వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ!
యంగ్ హీరో అంకిత్ కొయ్య, నీలఖి జంటగా తెరకెక్కిన బ్యూటీ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది.
By: M Prashanth | 18 Sept 2025 5:01 PM ISTయంగ్ హీరో అంకిత్ కొయ్య, నీలఖి జంటగా తెరకెక్కిన బ్యూటీ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగడంతో ఆసక్తి మరింత పెరిగింది.
స్టార్ డైరెక్టర్ మారుతి, కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ వంటి వారంతా ఈ సినిమా ప్రత్యేకతను గురించి మాట్లాడడంతో ఆడియన్స్‌లో ఆసక్తి కలిగింది. తండ్రి కూతురు అనుబంధం, కుటుంబ విలువలతో కూడిన కథ ప్రేక్షకులను కచ్చితంగా కనెక్ట్ చేస్తుందనే నమ్మకం టీమ్‌కి ఉంది. ఇప్పుడు మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే యూఎస్‌ఏ, కెనడాలోని ప్రముఖ నగరాల్లో ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
AMC, Regal, Marcus, Harkins, Cinelounge వంటి థియేటర్లలో షెడ్యూల్స్ ఫిక్స్ చేశారు. న్యూ జెర్సీ, న్యూయార్క్, చికాగో, టెక్సాస్, కాలిఫోర్నియా, అట్లాంటా, టాంపా, ఒమాహా, మిన్నెసోటా, నాష్‌విల్లే లాంటి నగరాల్లో బ్యూటీ ప్రదర్శించనుంది. కెనడాలోనూ టొరంటో, మిస్సిసాగ, రిచ్మండ్ హిల్‌లో రిలీజ్ కానుంది.
ఈ లెవెల్ రిలీజ్ అంటే, మిడిల్ రేంజ్ సినిమాకు చాలా అరుదైన అవకాశం. సాధారణంగా ఇలాంటి లవ్ ఫ్యామిలీ డ్రామాలు లోకల్ మార్కెట్‌కే పరిమితం అవుతాయి. కానీ, బ్యూటీ మూవీని జీ స్టూడియోస్, వానర సెల్యూలాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్ట్స్ బ్యానర్స్ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం విశేషం. కంటెంట్‌పై మేకర్స్ ఉన్న నమ్మకానికి ఇదొక నిదర్శనం అని చెప్పవచ్చు.
సినిమాలో నరేష్, వాసుకి, నందగోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ జె.ఎస్.ఎస్. వర్ధన్ తన ప్రత్యేకమైన రైటింగ్, దర్శకత్వంతో ఈ సినిమా హృదయాలను హత్తుకుంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే బ్యూటీపై వచ్చిన రిపోర్ట్స్, సెన్సార్ రివ్యూలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. మొత్తానికి, బ్యూటీ ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుండగా, కంటెంట్ రిచ్ సినిమా కావడంతో ఎక్కడ చూసినా చర్చ మొదలైంది. తెలుగు ప్రేక్షకులతో పాటు, విదేశాల్లోని తెలుగు కమ్యూనిటీ కూడా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యూటీ రిలీజ్ అనంతరం ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.
