Begin typing your search above and press return to search.

పాములు, బల్లులు తినే ఈ హీరో.. డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?

ఆయన ఎవరో కాదు.. డిస్కవరీ ఛానల్ లో ప్రసారమైన 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' హీరో బేర్ గ్రిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  Madhu Reddy   |   1 Dec 2025 12:23 PM IST
పాములు, బల్లులు తినే ఈ హీరో.. డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?
X

సినిమాలలో చాలామంది హీరోలు రియల్ స్టంట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది డూప్ లను వాడినా.. మరికొంతమంది మాత్రం సహజంగా ఉండాలని ఎంత కష్టమైనా సరే స్టంట్స్ చేస్తూ సినిమాపై వారికున్న ప్యాషన్ ఏంటో నిరూపిస్తూ ఉంటారు. అయితే ఇలా రియల్ గా కష్టపడాలి అంటే వీరు ఆరోగ్యం విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరాన్ని యంగ్గా ఫిట్గా ఉంచుకోవాలి అంటే తగిన వ్యాయామాలతో పాటు ఆహార నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది.

ఇకపోతే 90స్ కిడ్స్ కి బాగా సుపరిచితుడైన ఒక హీరో మాత్రం తన ఆహార శైలితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా అడవుల్లో తిరుగుతూ పాములు, పురుగులు , బల్లులు ఇలా ఏది కనిపిస్తే దానిని తింటూ అందరినీ ఆశ్చర్యపరిచిన ఈయన.. నిజజీవితంలో ఇంట్లో ఉన్నప్పుడు ఏం తింటాడు ? అసలు ఆయన ఆరోగ్యం వెనుక ఉన్న అసలు డైట్ సీక్రెట్ ఏంటి? అని తెలుసుకోవడానికి అందరూ ఇప్పటికీ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ హీరో ఎవరు? ఆయన పాములు, బల్లులు తినడం ఏంటి.. ? అసలు ఆయన డైట్ సీక్రెట్ ఏంటి ? ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తారు? ఇలా పలు విషయాలు తెలుసుకుందాం.

ఆయన ఎవరో కాదు.. డిస్కవరీ ఛానల్ లో ప్రసారమైన 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' హీరో బేర్ గ్రిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా 90స్ కిడ్స్ కి ఈయన బాగా సుపరిచితుడు. అడవిలో కనిపించే పురుగులు, పాములు, బల్లులు ఇలా ఏది పడితే అది తినే ఈయన ఇంట్లో ఉంటే మాత్రం చాలా పద్ధతిగా డైట్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈయన డైట్ సీక్రెట్ విషయానికి వస్తే.. ఉదయం లేవగానే ప్రకృతిని ఆస్వాదించే ఈయన.. తన బ్రేక్ ఫాస్ట్ లో నాలుగు గుడ్లు వెన్నలో వేయించుకొని మరీ తింటారట. దాంతోపాటు గడ్డ పెరుగు, బెర్రీలు, ప్రోటీన్ పౌడర్, కొంచెం తేనె అన్నీ కలిపి తీసుకుంటారు. అలాగే తాజా ఆరెంజ్ బ్రేక్ ఫాస్ట్ లో తప్పనిసరి.

ఫిట్నెస్ కోసం బంగాళదుంపలు, వైట్ రైస్, తేనె లాంటి మంచి కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాలను తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారట. సాధారణంగా డైట్ చేసేవారు ఇలా కార్బోహైడ్రేట్స్ కి దూరంగా ఉంటారు. కానీ ఈయన మాత్రం ఇది తన ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతాయని బలంగా నమ్ముతారు కూడా. రాత్రి భోజనం విషయానికి వస్తే.. మాంసంతో పాటు ఉడికించిన బంగాళా దుంపలు అలాగే చీజ్ కలిపి తీసుకుంటారట. ముఖ్యంగా రైతుల దగ్గర దొరికే సహజమైన ఆహారానికే ఓటు వేస్తానని ఎన్నో సందర్భాలలో తెలిపారు కూడా..

పడుకునే ముందు ఒక స్పెషల్ స్మూతీని తానే స్వయంగా తయారు చేసుకుని తాగుతారట. స్మూతీ విషయానికొస్తే.. పచ్చిపాలు, ప్రోటీన్ పౌడర్, అరటిపండు , ఐస్, తేనె వేసి బ్లెండ్ చేసుకుని తాగేస్తారట. ముఖ్యంగా నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే బేర్ గ్రిల్ లాగా సింపుల్గా పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా, యంగ్గా, ఫిట్గా ఉంటారని న్యూట్రిషియన్లు కూడా తెలియజేస్తున్నారు..