బిగ్ బాస్ 9.. రీతూని కాపాడిన కెప్టెన్ తనూజ..!
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం రీతూకే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి.
By: Ramesh Boddu | 18 Nov 2025 9:54 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం రీతూకే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. ఇమ్మాన్యుయెల్ రీతూనే నామినేట్ చేశాడు. భరణి కూడా రీతూని నామినేట్ చేసింది. మరోపక్క డీమాన్ పవన్ కూడా ఆమెను నామినేట్ చేశాడు. రీతుతో క్లోజ్ గా ఉంటూ రీతుని నామినేట్ చేసి ఆమె వల్ల తను డిస్ట్రబ్ అవుతున్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు డీమాన్ పవన్. ప్రతి విషయంలో తను ఆమె కోసం స్టాండ్ తీసుకుంటున్నా అది ఆమె అర్థం చేసుకోవట్లేదని అన్నాడు. అంతేకాదు సంచాలక్ గా ఆమె ఫెయిల్ అయ్యిందని చెప్పాడు.
డీమాన్ పవన్ నామినేషన్ ఎక్స్ పెక్ట్ చేయని రీతు..
ఐతే డీమాన్ పవన్ నామినేషన్ ని ఎక్స్ పెక్ట్ చేయని రీతు చౌదరి బోరున ఏడ్చేసింది. వాష్ రూంలో డోర్ వేసుకుని మరీ ఏడ్చింది. ఆ తర్వాత వచ్చి పవన్ తో మాట్లాడింది. నా వల్ల కావట్లేదు పవన్ అంటూ అరిచింది.. పవన్ కూడా నాకు అవ్వట్లేదని గట్టిగా అరిచాడు. ఐతే రీతూ ఫ్రెండ్ షిప్ ని డీమాన్ చాలా పర్సనల్ గా తీసుకున్నాడనే విషయం అర్థమవుతుంది. అందుకే కళ్యాణ్ వచ్చి మాట్లాడుతుంటే కూడా పవన్ వెళ్లిపోయి ఆ తర్వాత మళ్లీ పవన్ రీతూతో వాడికి ఒక నిమిషం మాట్లాడుతున్నామని చెప్పొచ్చు కదా అని వాధించాడు.
నామినేషన్స్ లో రీతూతో సహా దివ్య, భరణి, ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, సంజన, డీమాన్ పవన్ ఉన్నారు. ఐతే కెప్టెన్ తనూజని నామినేషన్స్ నుంచి ఒకరిని సేఫ్ చేయాలని అడగ్గా రీతూ పేరు చెప్పింది తనూజ. ఇది పాజిటివ్ గా కాదు నెగిటివ్ గా చెబుతున్నా ఇక మీదట నీ ఆట నువ్వు ఆడుకో ఎవరి కోసమో కాదు అని చెబుతూ తనూజ రీతూని నామినేషన్స్ నుంచి సేఫ్ చేసింది.
తనూజకి హగ్ చేసుకుని థాంక్స్ చెప్పిన రీతూ..
రీతు సేఫ్ అవ్వడంతో తనూజకి హగ్ చేసుకుని థాంక్స్ చెప్పింది. డీమాన్ పవన్ కూడా రీతూని నామినేషన్స్ నుంచి సేఫ్ చేసినందుకు తనూజకి థాంక్స్ చెప్పాడు. అలా రీతూ సేవ్ అవ్వగా దివ్య, కళ్యాణ్, పవన్, భరణి, సంజన, ఇమ్మాన్యుయెల్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ లో తనూజ తీసుకున్న స్టెప్ ఆడియన్స్ ని కూడా సర్ ప్రైజ్ చేసింది.
కెప్టెన్ తనూజ లాస్ట్ వీక్ దివ్య హౌస్ లో ఉండాలని గౌరవ్ కోసం తన డైమండ్ పవర్ వాడలేదు. అంతకుముందు వారం కూడా భరణి కోసం అది వాడితే వెళ్తాడని తెలిసి వాడలేదు. అలా భరణి, దివ్యలకు తన పవర్ తో సేఫ్ చేసిన తనూజ ఈ వారం కెప్టెన్ అవ్వడం వల్ల రీతూని సేఫ్ చేసి తన క్లవర్ నెస్ చాటుకుంది.
