బిగ్ బాస్ 9.. ఇది కదా అసలైన ఆట..!
బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. దానితో పాటు ఈ టాస్క్ ప్రతి రౌండ్ గెలిచిన వారికి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగేలా బోర్డ్ లు ఏర్పాటు చేశారు.
By: Ramesh Boddu | 3 Oct 2025 10:14 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. దానితో పాటు ఈ టాస్క్ ప్రతి రౌండ్ గెలిచిన వారికి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగేలా బోర్డ్ లు ఏర్పాటు చేశారు. ప్రతి టాస్క్ గెలిచిన టీం లీడర్ కి కంటెండర్, నాక్ అవుట్, లగ్జరీ ఫుడ్ లాంటి అవకాశాలు వస్తాయి. ఐతే ఈ వారం జరుగుతున్న ఈ టాస్క్ లో కళ్యాణ్ పడాల అదరగొట్టేస్తున్నాడు. బిగ్ బాస్ అగ్నిపరీక్షతో హౌస్ లోకి వచ్చిన అతను జరిగిన 3 వారాలు అసలు ఆట ఆడలేదు అన్నట్టుగా కనిపించింది. ఐతే లాస్ట్ వీక్ ప్రియా, కళ్యాణ్ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండగా ఫైనల్ గా ప్రియ శెట్టి ఎలిమినేట్ అవగా కళ్యాణ్ పడాల సేఫ్ అయ్యాడు.
ఆర్మీలో పనిచేసే కళ్యాణ్..
ఆర్మీ లో పనిచేసే కళ్యాణ్ ని హౌస్ లో చూడాలని ఆడియన్స్ అతనికి సపోర్ట్ చేశారు. కానీ 3 వారాల్లో అతను ఆట ఏమాత్రం ఆకట్టుకోలేదు. 3వ వారం డేంజర్ జోన్ లో ఉన్న అతను ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. కానీ ఆడియన్స్ అతన్ని కాపాడారు. అందుకే తన మీద ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని 4వ వారంలో తన ఆట మొదలు పెట్టాడు కళ్యాణ్. జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్ ఆటలో కళ్యాణ్ దూసుకెళ్తున్నాడు.
బాల్ టాస్క్ లో బుట్టలో బిగ్ బాస్ చెప్పిన కలర్ బాల్ వేయాలని చెప్పగా.. కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్ ఒక రేంజ్ లో ఆడుతున్నారు. మొదటి రెండు రౌండ్లలో కళ్యాణ్ టీం విన్ అయ్యింది. దాని వల్ల అతను కప్టెన్సీ కంటెండర్ అవ్వడమే కాకుండా భరణి టీం ని నాక్ అవుట్ చేసి ఈ టాస్క్ నుంచి తొలగించారు. ఇక జరుగుతున్న టాస్కుల్లో కళ్యాణ్ యాక్టివ్ నెస్ చూసి ఇది కదా ఇన్నాళ్లు మేము కోరింది అనుకుంటున్నారు.
అటు రీతు ఇటు తనూజాతో..
ఎలిమినేషన్ దాకా వెళ్లొచ్చాడు కాబట్టి కళ్యాణ్ ఆట మార్చాడు. కళ్యాణ్ ఇంట్లో అటు రీతు ఇటు తనూజాతో క్లోజ్ గా ఉంటున్నాడు. తనూజ కూడా కళ్యాణ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగానే ఉంది. మొత్తానికి హౌస్ లో కళ్యాణ్ యాక్టివేట్ అవ్వడం టాస్క్ లు బాగా ఆడటం ఇక నుంచి అతని ఆట మెరుగుపడుతుందని భావిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో కామనర్స్ లో ఫస్ట్ హౌస్ లోకి అడుగు పెట్టింది కళ్యాణ్ మాత్రమే. దానికి తగినట్టుగా ఆట ఆడట్లేదన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ వారం ఫాంలోకి వచ్చిన కళ్యాణ్ ఇదే దూకుడు కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.
