Begin typing your search above and press return to search.

త్రిబాణధారి బార్బరిక్.. ఫ్రీగా సినిమా చూసి డబ్బులిచ్చారు: నిర్మాత

అలాంటి కథతోనే తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ మూవీని భారీ స్థాయిలో నిర్మించారు నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల.

By:  M Prashanth   |   25 Aug 2025 8:29 PM IST
త్రిబాణధారి బార్బరిక్.. ఫ్రీగా సినిమా చూసి డబ్బులిచ్చారు: నిర్మాత
X

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కంటెంట్, భిన్నమైన కథలకే ఆడియెన్స్ ఆదరణ పెరుగుతోంది. అలాంటి కథతోనే తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ మూవీని భారీ స్థాయిలో నిర్మించారు నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో, వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా, సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, సాంచీ రాయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై నిర్మాత స్వయంగా పంచుకున్న అనుభవాలు ఆసక్తికరంగా మారాయి.

నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ.. "నేను బిజినెస్‌లో బిజీగా ఉన్నప్పటికీ, మోహన్ గారు చెప్పిన కథ విన్న వెంటనే బాగా ఆకట్టుకుంది. మొదట చిన్న బడ్జెట్‌లో ప్లాన్ చేసుకున్నా, కథ డిమాండ్, మారుతి గారి సపోర్ట్‌తోనే ఈ సినిమాను భారీ స్థాయిలో చేయాలని ఫిక్స్ అయ్యాం. మారుతి గారు సినిమా బాగా తీయండి లేదంటే వద్దు అని సూటిగా చెప్పడంతో, మేము నాణ్యతపై ఎక్కడా రాజీపడలేదు" అన్నారు.

థ్రిల్లింగ్ టచ్‌తో కొత్త అనుభవం

కథలో మైథలాజికల్ యాంగిల్‌ను యాడ్ చేయడం ప్రత్యేకత అని నిర్మాత చెబుతున్నారు. వరంగల్, విజయవాడలో ప్రీమియర్లు వేసినప్పుడు ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉందని, కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ రిస్పాన్స్‌తోనే తమ కష్టానికి ఫలితం తెలిసిందని, సినిమా చూసిన తర్వాత అందరూ భావోద్వేగానికి లోనయ్యారని అన్నారు.

టెక్నికల్ పరంగా కూడా సినిమా కొత్తదనాన్ని ఇస్తుందని నిర్మాత తెలిపారు. “ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. కెమెరామెన్ కుశేందర్ రమేష్ రెడ్డి అందించిన విజువల్స్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతాయి. రైటర్ ఇమ్రాన్ రాసిన సంభాషణలు కూడా సహజంగా, హృదయానికి తాకేలా ఉంటాయి” అని తెలిపారు.

ఆర్టిస్టుల ఎంపికలో ప్రత్యేకత

సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఇచ్చామని నిర్మాత చెప్పారు. “సత్య రాజ్ గారు ఇప్పటివరకు చేయని రోల్‌లో కనిపిస్తారు. ఆయన మొదటి సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఉదయభాను గారికి కూడా కీలక పాత్ర వచ్చింది. ఇది ఆమెకు రెండో ఇన్నింగ్స్‌లో పెద్ద అవకాశాలను తెచ్చిపెడుతుంది. సత్యం రాజేష్, వశిష్ట, సాంచీ రాయ్ తదితరులు తమ తమ రోల్స్‌లో మెప్పిస్తారు” అని అన్నారు.

ఫ్రీగా సినిమా చూసి, ఆ తర్వాత డబ్బులు ఇచ్చారు

మైత్రి మూవీ మేకర్స్ నైజాంలో రిలీజ్ చేస్తున్నందునే తేదీ మారిందని నిర్మాత స్పష్టం చేశారు. “వార్ 2, కూలీ లాంటి పెద్ద సినిమాలు నడుస్తున్న సమయంలో కావాల్సిన థియేటర్లు దొరకవు. అందుకే ఆగస్ట్ 22కి కాకుండా ఆగస్ట్ 29కి వాయిదా వేసాం. ఇప్పుడు మాకు కావాల్సిన స్క్రీన్లు లభించాయి. భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ “ప్రేక్షకులు కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉండాలని భావించాం. అందుకే మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ టికెట్ రేటు రూ.150లోపు పెట్టాం. వరంగల్‌లో జరిగిన స్పెషల్ ప్రీమియర్ షోలో ఒక జంట ఫ్రీగా సినిమా చూసి, ఆ తర్వాత డబ్బులు ఇచ్చారు. ఆ మూమెంట్ నా మనసుకు నిజమైన సంతృప్తి ఇచ్చింది. సినిమా మంచి సందేశంతో పాటు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తుంది” అని ముగించారు.