Begin typing your search above and press return to search.

స్టేజిపై బూతు సాంగ్.. జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

ఈవెంట్ లో భాగంగా చంద్రహాస్ స్టేజిపై బూతు పదాలతో పాట పాడగా.. ఆ సమయంలో జేడీ చక్రవర్తి అక్కడే ఉన్నారు.

By:  M Prashanth   |   4 Feb 2026 10:43 PM IST
స్టేజిపై బూతు సాంగ్.. జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?
X

బుల్లితెర స్టార్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ లీడ్ రోల్ లో నటించిన మూవీ బరాబర్ ప్రేమిస్తా రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సంపత్ రుద్రా తెరకెక్కించిన ఆ సినిమా.. ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్స్ లో విడుదల అవుతుంది. దీంతో మేకర్స్ రీసెంట్ గా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించగా.. ఆ కార్యక్రమానికి సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి గెస్ట్ గా వచ్చారు.

ఈవెంట్ లో భాగంగా చంద్రహాస్ స్టేజిపై బూతు పదాలతో పాట పాడగా.. ఆ సమయంలో జేడీ చక్రవర్తి అక్కడే ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అయ్యి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆ విషయంపై జేడీ చక్రవర్తి రెస్పాండ్ అయ్యారు. పరోక్షంగా ఈవెంట్ కోసం మాట్లాడుతూ.. వీడియో రిలీజ్ చేశారు.

సినిమాల ప్రమోషన్స్ ఎప్పుడైనా ఆకట్టుకునేలా ఉండాలని, కానీ అసభ్యంగా ఉండకూడదని జేడీ చక్రవర్తి అన్నారు. ప్రమోషన్స్ కోసం క్రియేటివ్ గా ఆలోచించాలని, అలా చేయడం తప్పు కాదని తెలిపారు. ఆడియన్స్ కు ప్రమోషన్స్ చేరేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. అందుకోసం అసభ్యకరమైన మార్గాలు అనుసరించాల్సిన అవసరం అసలు లేదని స్పష్టం చేశారు.

ప్రమోషన్స్ అంటే గ్లామర్ షో, బూతు పాటలు కాదని చెప్పిన జేడీ చక్రవర్తి.. ఇటీవల వెళ్లిన ఓ ఈవెంట్ లో సాంగ్ పాడటం చూసి తాను షాక్‌ అయ్యానని అన్నారు. అదే సమయంలో పాట వినగానే అక్కడి నుంచి వెళ్లిపోయి ఉండాల్సిందని అన్నారు. ఈ మధ్య కొన్ని సినిమాలకు చెందిన ప్రమోషనల్ ఈవెంట్స్ లో అసభ్యత ఎక్కువ అయిందంటూ జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్ చేశారు.

అదే సమయంలో ఉదాహరణగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన ప్రమోషన్లు గుర్తుచేశారు. బ్లాక్ బస్టర్ మూవీ 3 ఇడియట్స్ సినిమా సమయంలో ఆయన వినూత్నంగా ప్రచారం చేశారని తెలిపారు. పలు గెటప్స్ లో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారని.. ఏకంగా ఆయన ఎవరో తెలియక పోలీస్ కంప్లైంట్ వెళ్లిందని చెప్పారు. కానీ ప్రమోషన్స్ లో ఎక్కడా అసభ్యత లేదని అన్నారు. ఇలాంటి ఐడియాలు తీసుకురావాలని అన్నారు.

అంతేగానీ ఎప్పుడైనా హద్దులు దాటడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. టెంపరరీ హంగామా కంటే సినిమా గౌరవం ముఖ్యమని పరోక్షంగా తెలిపారు. ప్రస్తుతం నెట్టింట జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడమే కాకుండా.. సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి ప్రమోషన్స్ కోసం సంస్కారం కోల్పోవద్దన్న సందేశాన్ని ఆయన తన కామెంట్స్ ద్వారా స్పష్టంగా ఇచ్చారని చెప్పాలి.