Begin typing your search above and press return to search.

వండే వండర్ అనుకున్నా.. రవితేజకు ఆల్టర్నేట్..!

ఇక తన ప్రొడక్షన్ గురించి చెబుతూ బ్లాక్ బస్టర్ తో బ్రేక్ ఇచ్చా ఇక మొదలు పెడతా అన్నారు బండ్ల గణేష్.

By:  Ramesh Boddu   |   23 Oct 2025 9:41 AM IST
వండే వండర్ అనుకున్నా.. రవితేజకు ఆల్టర్నేట్..!
X

సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ మరోసారి అదరగొట్టే స్పీచ్ ఇచ్చారు. సిద్ధు వన్ డే వండర్ అనుకున్నా కానీ ఇండస్ట్రీని రూల్ చేస్తావ్ సిద్ధు అని అన్నారు బండ్ల గణేష్. డీజే టిల్లులానే చేస్తే ఇది బోర్ కొట్టేస్తుంది అనుకున్నా కానీ ఫేస్ టర్న్ ఇచ్చి కొత్త షేద్ చూపించావ్.. నీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉందని అన్నారు బండ్ల గణేష్.

ఇక స్పీచ్ లో భాగంగానే చిరంజీవి స్వయంకృషి చేశాడు, ముఠామేస్త్రి చేశాడు.. నాగార్జున గీతాంజలి చేశాడు, శివ చేశాడు.. వెంకటేష్ బొబ్బిలి రాజా చేశాడు, చంటి చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు.. తెలుసు కదా చేశాడని అన్నారు బండ్ల గణేష్. ఈ సినిమాలో ఇరగ్గొట్టేశాడు అని అన్నారు బండ్ల గణేష్. జోష్ సినిమాలో చిన వేషం కోసం తపించిన సిద్ధు ఈ సినిమా తర్వాత రవితేజకు ఆల్టర్నేట్ అవుతావ్ అనిపించాడని అన్నారు.

బ్లాక్ బస్టర్ తో బ్రేక్ ఇచ్చా..

ఇక తన ప్రొడక్షన్ గురించి చెబుతూ బ్లాక్ బస్టర్ తో బ్రేక్ ఇచ్చా ఇక మొదలు పెడతా అన్నారు బండ్ల గణేష్. ఫ్లాప్ తో నేను బ్రేక్ ఇవ్వలేదు.. టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ తో బ్రేక్ ఇచ్చా.. ఇప్పుడు మొదలవుతుంది సెకండ్ హాఫ్ అని అన్నారు.

ఇక మీడియా మిత్రులకు, పోలీసులకు సెలవులు ఉండవని.. నిరంతరం పనిచేస్తుంటారని అన్నారు బండ్ల గణేష్. పండగైనా సరే మా గురించి మంచి చెడులు ప్రజలకు చేరువేసే మీడియా వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు బండ్ల గణేష్.

ఐతే ఈమధ్యనే లిటిల్ హార్ట్స్ ఈవెంట్ లో మౌళికి పొగడ్తల గురించి పట్టించుకోకు అంటూ చెప్పిన బండ్ల గణేష్. ఈరోజు మళ్లీ అదే పని సిద్ధు విషయంలో చేయడం ఏంటంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక బండ్ల గణేష్ సెకండ్ హాఫ్ ఎలాంటి సినిమాలు చేస్తారో అంటూ డిస్కషన్స్ మొదలు పెట్టారు. ఏది ఏమైనా ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ ఇస్తే మాత్రం అదో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటుందని అంటున్నారు.

బండ్ల గణేష్ 10 ఏళ్ల గ్యాప్..

బండ్ల గణేష్ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రొడక్షన్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా సినిమాలు చేస్తే ఈసారి భారీ సినిమాలనే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అందుకే సెకండ్ హాఫ్ అదిరిపోతుందని హింట్ ఇచ్చాడు బండ్ల గణేష్.

యువ హీరోలతో కూడా బండ్ల గణేష్ సినిమాలు చేసే అవకాశం లేకపోలేదు. ఎలాగు మన స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి బండ్ల గణేష్ ఛాయిస్ యువ హీరోలే అవుతారని చెప్పొచ్చు. మరి బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ నెక్స్ట్ మూవీ ఏ హీరోతో అన్నది ఆసక్తి కలిగిస్తుంది.