బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కితే అందరూ బౌల్డ్!
ఒక వ్యక్తి గురించి మాట్లాడలన్నా? సినిమా గురించి మాట్లాడాలన్నా? ఆయన తర్వాతే ఎవరైనా! ఎలాంటి కంటెంట్ తీసు కున్నా? దాని గురించి గొప్ప గా ప్రశంశిస్తూ మాట్లాడటం ఆయనకే చెల్లింది.
By: Srikanth Kontham | 26 Sept 2025 1:00 AM ISTసినిమా వేదికలపై బండ్ల గణేష్ మాట్లాడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక వ్యక్తి గురించి మాట్లాడలన్నా? సినిమా గురించి మాట్లాడాలన్నా? ఆయన తర్వాతే ఎవరైనా! ఎలాంటి కంటెంట్ తీసు కున్నా? దాని గురించి గొప్ప గా ప్రశంశిస్తూ మాట్లాడటం ఆయనకే చెల్లింది. ఆయన మాట్లాడుతుంటే కింద నుంచి వైబ్ కూడా అలాగే ఉంటుంది. ప్రేక్షకాభిమానులుంతా ఉర్రూతలూగిపోతారు. కేరింతలతో కాక పుట్టిస్తారు. బండ్లన్నను స్టేజ్ మీదకు ఆహ్వానిస్తేనే వైబ్ మొదలైపోతుంది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించి గణేష్ మాట్లాడుతుంటే వైబ్ పీక్స్ లో కనిపిస్తుంది.
ఆయన మాత్రమే వైరల్:
అయితే కొంత కాలంగా బండ్ల గణేష్ నిర్మాణానికి దూరంగా ఉండటంతో అవన్నీ గణేష్ అభిమానులు మిస్ అవుతున్నారు. అప్పుడప్పుడు చిన్నచితకా ఈవెంట్లకు హాజరవ్వడం మినహా పెద్ద ఈవెంట్లలలో ఆయనెక్కడా కనిపించడం లేదు. మరి ఎందుకు బండ్ల గణేష్ దూరంగా ఉంటున్నారు? అంటే ఆయన ఉండటం లేదు. ఆయన్ని ఉంచినట్లు కనిపిస్తోంది. అందుకు తనలో ఉన్న ఆ వాక్చుతర్యమే కారణంగా మారిందని వినిపిస్తోంది. గణేష్ స్టేజ్ ఎక్కి మాట్లాడితే మిగతా వాళ్లు ఏం మాట్లాడినా కిల్ అవుతుంది. సినిమా గురించి ఎంత చెప్పినా? ఆ టాపిక్ పక్కుకు పోయి గణేష్ మాట్లాడిందే హైలైట్ అవుతుంది.
అందుకే ఆహ్వానించడం లేదా:
సోషల్ మీడియా లో కూడా గణేష్ ఏం మాట్లాడితే అదే వైరల్ అవుతుంది. ఆయన వాయిస్ ను బిట్లు బిట్టుగా కట్ చేసి వదులుతున్నారు. అందులో సినిమా టాపిక్ తక్కు వగా..ఇతర అంశాలు ఎక్కువగా ఉండటంతో? అసలు విషయం పక్క దారి పడుతుంది. ఈ విషయంలో స్టార్ హీరో కూడా సినిమా గురించి ఏం మాట్లాడినా వైరల్ అవ్వడం లేదు. ఇక దర్శక, నిర్మాతలు మాట్లాడితే పట్టించుకునేది ఎవరు? అందుకే కొంత కాలంగా గణేష్ ఏ సినిమా ఈవెంట్లలో పెద్దగా కనిపించలేదని..అసలు పిలవడమే మానేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడు కుంటున్నారు.
ఆయన గురించి ఇలా ఆలోచించలేరా:
గణేష్ టోన్ మిగతా వాళ్లందర్నీ డామినేట్ చేస్తుందని అంటున్నారు. ఆయన్ని మించిన బడా నిర్మాతలు ఎంత మంది ఏం మాట్లాడినా? వాటిని పట్టించుకునే నాదుడే లేదంటున్నారు. వ్యక్తిగతంగానూ గణేష్ కే ప్రాముఖ్యత దక్కుతుందని అంటున్నారు. ఈ కారణాలుగానే పెద్ద సినిమా ఈవెంట్లలలో గణేష్ కనిపించడం లేదంటున్నారు. మళ్లీ గణేష్ మునిపటిలా సినిమా వేదికలపై కనిపించాలంటే? ఆయన టోన్ డౌన్ చేస్తే తప్ప మరో మార్గం లేదంటున్నారు. మరి బైబర్త్ వచ్చినా? అలవాటుని గణేష్ ఎలా మార్చుకోగలరు. ఇలా ఆలోచించే వాళ్లే లేరా!
