వారికి కుమారులే అసలైన వరం - బండ్ల గణేష్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఎప్పుడూ తన ఓపెన్ టాక్‌తో వార్తల్లో నిలుస్తుంటారు.
By: Madhu Reddy | 25 May 2026 4:19 PM ISTటాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఎప్పుడూ తన ఓపెన్ టాక్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా సీనియర్ నటుడు రాజా రవీంద్ర హోస్ట్ చేస్తున్న ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రస్థానం, జీవితంలోని ఒడిదుడుకులతో పాటు ఏపీ మంత్రి నారా లోకేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌లపై బండ్ల గణేష్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..
నారా లోకేష్ ఒక రోల్ మోడల్:
ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఒక మనిషి అనుకుంటే ఇంతలా మారొచ్చా అని ఆశ్చర్యం కలిగించే వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు. "ఒకప్పుడు ఆయన బాడీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది అనేది అందరం చూశాం. వేల కోట్లకు అధిపతి అయినా సరే, తిండి మానేసి మరీ ఆయన తన బాడీ ఫిట్‌నెస్ మీద చూపించిన శ్రద్ధ నిజంగా ఎంతో మందికి రోల్ మోడల్. మా పిల్లలకు కూడా నేను ఆయన్నే ఉదాహరణగా చూపిస్తాను" అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
సీఎం కొడుకైనా ఇంత సింప్లిసిటీనా:
నారా లోకేష్ బాడీ పరంగానే కాకుండా రాజకీయాల్లో కూడా చాలా మెచ్యూర్‌గా వ్యవహరిస్తున్నారని బండ్ల ప్రశంసించారు. ఇక ఇటీవల కర్ణాటకలో జరిగిన ఒక సభలో ఆయనకు తెలుగు వాళ్ళు బ్రహ్మరథం పట్టారని తెలిపాడు. అంత పెద్ద పొజిషన్‌లో ఉండి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో పుట్టి పెరిగినా.. అక్కడ తన కోసం వేసిన ప్రత్యేకమైన చైర్‌ను కాదని, సాధారణ కుర్చీలోనే కూర్చున్నారని ఆయన సింప్లిసిటీని మెచ్చుకున్నారు. చంద్రబాబు లాంటి తండ్రికి లోకేష్ లాంటి కొడుకు దొరకడం ఒక వరం అని అయన అన్నారు.
రామ్ చరణ్ కష్టం చూసి ఎమోషనల్:
ఇక మెగాస్టార్ చిరంజీవి పుత్రరత్నం రామ్ చరణ్ గురించి కూడా బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. రాజా రవీంద్ర 'పెద్ది' సినిమా ట్రైలర్ ప్రస్తావిస్తూ.. అందులో చరణ్ లుక్ చూసి ఎమోషనల్ అయ్యానని చెప్పగా, బండ్ల గణేష్ కూడా దానికి ఏకీభవించారు. ఇక ఆ ట్రైలర్‌లో రామ్ చరణ్ బాడీ చూస్తే ఆయన ఎంత కష్టపడ్డారో అర్థమవుతుందని బండ్ల అన్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే చిరంజీవికి ఇలాంటి కొడుకు పుడతారని, ఆయా రంగాల ప్రముఖులకు దేవుడు ఇచ్చిన అసలైన వరం వాళ్ల కుమారులే అని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.
బండ్ల గణేష్ సెకండ్ ఇన్నింగ్స్:
కమెడియన్‌గా, బ్లాక్‌బస్టర్ల నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న బండ్ల గణేశ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన తన రీఎంట్రీ ఇస్తున్నారు తెలిపారు.ఇక చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమాలో ఆయన నటిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే త్వరలోనే నిర్మాతగా కూడా మళ్లీ క్రేజీ సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
బండ్ల గణేష్ మాట్లాడితే అందులో ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ఆయన నారా లోకేష్ సాదాసీదా స్వభావాన్ని, అలాగే రామ్ చరణ్ కష్ట పడే తనం ను అభినందించిన తీరు అందరికి నచ్చుతోంది. ఇక చిరంజీవి సినిమాలో నటుడిగా బండ్ల గణేష్ రీఎంట్రీ ఇస్తుండటంతో మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
